Begin typing your search above and press return to search.
మహానటిపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!
By: Tupaki Desk | 10 May 2018 6:13 AM GMTఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అంటే ఎంత బిజీగా ఉంటారు? ముఖ్యమంత్రి కొడుకుగానే కాదు.. కీలక శాఖల్ని పర్యవేక్షిస్తూ ఉండే మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఎంత టైట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. మరి.. అలాంటి కేటీఆర్.. తీరిక చేసుకొని మరీ మూడు గంటల పాటు మహానటి మూవీని చూసేందుకు స్పెండ్ చేసిన వైనం ఆసక్తికరమైతే.. ఈ మూవీకి మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు.
మంచి సినిమా అయితే చాలు.. వెంటనే చూసే అలవాటుతో పాటు.. నచ్చిన సినిమాకు కాంప్లిమెంట్స్ మీద కాంప్లిమెంట్స్ ఇవ్వటం.. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోవటం కేటీఆర్ కు అలవాటు. ఏదైనా సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే కాస్త తీరుబడి చేసుకొని చూడటం మామూలే. దీనికి భిన్నంగా రిలీజ్ రోజునే సినిమాను చూసేయటం ఒక విశేషంగా చెప్పాలి.
మహానటి మూవీని ప్రకటించిన రోజు నుంచి రిలీజ్ వరకూ ఈ సినిమా మీద అంతకంతకూ పెరుగుతున్న అంచనాల సంగతి తెలిసిందే.ఈ కారణంతోనే కావొచ్చు.. రిలీజ్ అయిన మొదటిరోజునే మహానటి మూవీని చూసేశారు మంత్రి కేటీఆర్. సినిమా అద్బుతంగా ఉందని పొగిడేసిన ఆయన.. నమ్మశక్యం కాని రీతిలో సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చేశారు.
మహానటి సావిత్రి బయోపిక్ గా తీసిన మహానటి చిత్రం విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాను తీసిన విధానానికి.. సావిత్రిని ఎలివేట్ చేసిన తీరును ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ సైతం మహానటి ఫ్యాన్ క్లబ్లో చేరిపోయారు.
సావిత్రి పాత్రను చేసిన కీర్తి సురేశ్.. ఆ పాత్రలో జీవించారంటూ పొగిడిన కేటీఆర్.. ఆమె నటన అమోఘమని కొనియాడారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్.. ఈసినిమాలో కీలక పాత్రలు పోషించిన సమంత.. దుల్హర్.. నాగచైతన్య.. విజయదేవరకొండలను అభినందించారు. ఒక సినిమాను రిలీజ్ రోజే చూసేందుకు కేటీఆర్ టైం కేటాయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.