Begin typing your search above and press return to search.

ఆ కల్చర్ తెలుగు ప్రేక్షకులకు ఉంది

By:  Tupaki Desk   |   19 Sep 2016 5:22 AM GMT
ఆ కల్చర్ తెలుగు ప్రేక్షకులకు ఉంది
X
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. సినీ రంగానికి కూడా సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. సినిమాలు చూసి ట్వీట్స్ కూడా పెట్టే ఈయనను.. మూవీ ఫంక్షన్స్ కి తరచుగా హాజరవుతూనే ఉన్నారు. నిన్న జరిగిన జాగ్వార్ ఆడియో ఫంక్షన్ కి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

'భాషతో సంబంధం లేకుండా ట్యాలెంట్ ను ప్రోత్సహించే కల్చర్ తెలుగు ప్రేక్షకులకు ఉంది. తెలుగు కన్నడ భాషల్లో మరో స్టార్ హీరో రాబోతున్నాడని చెప్పేందుకు ఈ ట్రైలర్ కనిపించే సీన్స్.. పాటలే సాక్ష్యం. నిఖిల్‌.. సినిమా కోసం ఎంత కష్టపడ్డావో స్క్రీన్ పై కనిపిస్తోంది.. నీకు మంచి విజయం దక్కాలి’ అంటూ ఉత్సాహం నింపిన కేటీఆర్.. మ్యూజిక్ బాగుందంటూ థమన్‌ ను ప్రశంసించారు. జాగ్వార్ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

హైద్రాబాద్ నోవోటెల్ లో జరిగిన ఈ కార్యక్రమనానికి.. మాజీ ప్రధాని దేవెగౌడ.. రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి.. ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌.. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. జగపతిబాబు.. బ్రహ్మానందం.. రామజోగయ్యశాస్త్రిలు కూడా హాజరయ్యారు. చెన్నాంబిక ఫిలింస్ బ్యానర్.. నిఖిల్ తండ్రి హెచ్‌ డీ కుమారస్వామి జాగ్వార్ ని నిర్మించగా.. మహదేవ్‌ దర్శకత్వం వహించాడు.