Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి మెగా పవర్ స్టార్!
By: Tupaki Desk | 27 Dec 2018 5:36 PM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే అవుననే సంకేతమిచ్చిన వెరీ రేర్ సన్నివేశమది. నేటి సాయంత్రం హైదరాబాద్- యూసఫ్ గూడలో జరుగుతున్న ప్రీరిలీజ్ వేడుక లైవ్ లో ఈ కార్యక్రమ ముఖ్యఅతిధి - చరణ్ స్నేహితుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ ఇచ్చిన హింట్ ప్రస్తుతం వాడి వేడిగా చర్చకు తావిచ్చింది.
వేదికపై తనతో పాటే ఉన్న మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరినీ పొగిడేస్తూ కేటీఆర్ ఓ ఆసక్తికరమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. వినయ విధేయ రాముడిగా వస్తున్న రామ్ చరణ్ ఈ వేదికపై మా(రాజకీయ నాయకుల)కంటే అద్భుతంగా మాట్లాడారు. అతడికి మంచి భవిష్యత్ ఉంది.. (ఎక్స్‌ప్రెషన్).. అందుకు ఇంకా టైమ్ ఉంది.. కొంత టైమ్ ఉందిలే!! అంటూ చలోక్తిగా .. సరదాగా మాట్లాడేశారు.. ఓ రకంగా భవిష్యత్ లో బాబాయ్ .. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి అండగా చరణ్ రాజకీయాల్లోకి వెళ్లే ఆస్కారం ఉందన్న సంకేతాన్ని ఇచ్చారు కేటీఆర్.
కేటీఆర్ తో చరణ్ ఎంత సన్నిహితంగా ఉంటారో .. ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఎలాంటిదో అందరికీ ఈ వేదిక గొప్పగా క్లారిటీనిచ్చింది. ఇక ఇదే వేదికపై చరణ్ వినయ విధేయతల గురించి కేటీఆర్ అంతే గొప్పగా ప్రశంసించారు. తండ్రి నుంచి వచ్చిన వినయం విధేయత చరణ్ కి అలంకారమని, దాంతోనే అతడు మనసులు గెలుచుకున్నాడని కేటీఆర్ ప్రశంసించారు. వినయ విధేయ రామా పెద్ద విజయం సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. స్నేహితుడు రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలిపారు.