Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 2 ఆడిష‌న్స్ ఇంత క్రేజీగానా?

By:  Tupaki Desk   |   27 April 2019 8:05 AM GMT
కేజీఎఫ్ 2 ఆడిష‌న్స్ ఇంత క్రేజీగానా?
X
ఒక సాధార‌ణ డ్రైవ‌ర్ కొడుకు య‌శ్ న‌టించిన `కేజీఎఫ్` దేశ‌విదేశాల్లో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలిసిందే. బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌చారంతో య‌శ్ రాకింగ్ స్టార్ గా అంత‌టా పాపుల‌ర‌య్యాడు. కేజీఎఫ్ - చాప్ట‌ర్ 1 రిలీజ్ అనంత‌రం అత‌డు యూత్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. య‌శ్ అంటే అభిమానులు చెవులు కోసుకునే స్థాయి ఉందంటే అతిశ‌యోక్తి కాదు. కేజీఎఫ్ చిత్రంలో ఏటికి ఎదురీదే ర‌ఫ్ & ర‌గ్గ్ డ్ క్యారెక్ట‌ర్ లో య‌శ్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయారంతా. అందుకే ఇప్పుడు కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తెర‌కెక్కుతోంది అన‌గానే అంతే క్రేజు నెల‌కొంది. ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్.. ర‌వీనా టాండ‌న్ లాంటి స్టార్లు న‌టిస్తున్నార‌న్న ప్ర‌చారంతో అటు బాలీవుడ్ లోనూ హైప్ పెరిగింది.

ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ముగించి చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. వ‌చ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది టీమ్. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌నీల్.. హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఇప్ప‌టికే అందుకు సంబంధించిన ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే కేజీఎఫ్ 2 లో న‌టించే అరుదైన అద్భుత అవ‌కాశం అంటూ కాస్టింగ్ కాల్ వ‌చ్చింది. దానికి య‌శ్ అభిమానులు స‌హా న‌టించాల‌న్న కుతూహాలం ఉన్న వారంతా గొప్ప‌గా స్ప ందించారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఆడిష‌న్స్ కి ఊక‌వేస్తే రాల‌నంత మంది హాజ‌ర‌య్యార‌ని తెలుస్తోంది. ఆడిష‌న్స్ జ‌రిగే చోట ఆరు బ‌య‌ట ఎండ‌లో దాదాపు 5 వేల మంది నిల‌బ‌డి వెయిట్ చేశారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఓవైపు నెత్తిపై సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా .. ఎలాగైనా ఈ చిత్రంలో న‌టించాల‌న్న కుతూహాలం అక్క‌డ ఉన్న‌వారిలో క‌నిపించిందిట‌.

ఈ ఆడిష‌న్స్ లో 8-16 వ‌య‌సు ఉన్న టీనేజీ కుర్రాళ్ల‌ను పాతిక మంది యువ‌కుల్ని ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా ఎంపికైన వాళ్లంతా య‌శ్ గ్యాంగ్ లో సైడ్ ఆర్టిస్టులుగా క‌నిపిస్తారు. విల‌న్ల గ్యాంగ్ లోనూ తీసుకుంటార‌ట‌. అయితే ఆడిష‌న్స్ కి ఇంత గొప్ప రెస్పాన్స్ రావ‌డానికి కార‌ణం ఈ ఒక్క సినిమాలో క‌నిపిస్తే చాలు ఇటు సౌత్- అటు నార్త్ మొత్తం క‌నిపించొచ్చు అనే ఆస‌క్తి జ‌నాల్లో క్రియేటైంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక కేజీఎఫ్ సిరీస్ లో వ‌రుస‌గా సినిమాలొస్తాయ‌ని ఇదివ‌ర‌కూ టీమ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా నేప‌థ్య ంలో ఆసక్తిక‌ర సిరీస్ ఇదన్న సంగ‌తి తెలిసిందే.