Begin typing your search above and press return to search.
కుమారీ.. కేక పుట్టించావ్ పో
By: Tupaki Desk | 28 Nov 2015 9:30 AM GMTవీకెండ్ లో ఎలాంటి సినిమా అయినా సత్తా చూపిస్తుంది. కానీ సినిమా అసలు సత్తా ఏంటన్నది తెలిసేది వీకెండ్ తర్వాత వచ్చే వీక్ డేస్ లోనే. సోమవారం పరీక్షకు నిలిస్తేనే సినిమాలో విషయం ఉన్నట్లు. ‘కుమారి 21 ఎఫ్’ ఈ పరీక్షలో సూపర్ సక్సెస్ అయింది. తొలి మూడు రోజుల్లో రూ.6.4 కోట్లు కొల్లగొట్టిన ‘కుమారి..’ తర్వాతి నాలుగు రోజుల్లో దాదాపు రూ. 4 కోట్ల దాకా వసూలు చేసి తన బాక్సాఫీస్ పవర్ చూపించింది.
తొలి వారంలో కుమారి వరల్డ్ వైడ్ షేర్ రూ.10.3 కోట్ల దాకా ఉండటం విశేషం. ఓ చిన్న సినిమా సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల దాకా వసూలు చేయడమంటే చిన్న విషయం కాదు. నైజాం ఏరియాలో తొలి వారంలో కుమారి 21 ఎఫ్ రూ.3.9 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం సెన్సేషనే. ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇప్పటికే లాభాల బాటలోకి వచ్చినట్లు సమాచారం.
సీడెడ్లో రూ.1.1 కోట్లు, ఆంధ్రా అంతా కలిపి రూ. 3.5 కోట్ల దాకా షేర్ వచ్చింది. కర్ణాటకలో రూ.76 లక్షలు, అమెరికాలో రూ.68 లక్షలు వసూలు చేసింది కుమారి 21 ఎఫ్. మొత్తం కుమారి తొలి వారం షేర్ రూ.10.3 కోట్ల దాకా ఉంది. గ్రాస్ వసూళ్లు రూ.15 కోట్లు దాటాయి. ఈ శుక్రవారం విడుదలైన సైజ్ జీరో - తను నేను యావరేజ్ టాక్ తో నడుస్తుండటంతో కుమారి రెండో వారం కూడా హవా సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.