Begin typing your search above and press return to search.
డియర్ కుమారీ.. యు కాపీ క్యాట్
By: Tupaki Desk | 15 Sep 2015 7:30 AM GMTటాలీవుడ్ లో కాపీ క్యాట్ కథల గురించి గురించి బోలెడంత రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అడ్డగోలుగా పెరిగిపోయిన మీడియా పుణ్యమా అని రోజుకో కాపీ క్యాట్ గోల కంటిన్యూ అవుతూనే ఉంది. మీడియా విస్ర్తతి విపరీతంగా పెరగడం వల్ల .. టీఆర్ పీ కోసం హర్షా మెహతా స్కామ్ ని వెలికి తీసినట్టు ఇలా సినిమాల విషయంలోనూ కోడిగుడ్డు పై వెంట్రుకలు పీకడం మొదలైంది. టాలీవుడ్ లోనే అపజయమెరుగని స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళికే ఈ కాపీ క్యాట్ గోల తప్పలేదు. ఈగను కాపీ కొట్టేశాడు. మగధీర కోసం 300 సినిమానే లిఫ్ట్ చేసేశాడు. బాహుబలి పోస్టర్ సహా ప్రతిదీ కాపీనే అంటూ రచ్చ రచ్చ చేశారు.
ఇది కేవలం రాజమౌళికి మాత్రమే కాదు.. హాలీవుడ్ సినిమాల నుంచి ఎవరైనా ఇన్ స్పయిర్ అయ్యి సినిమా తీస్తే ఇక ఖతం అయిపోయినట్టే. క్రియేటివిటీని హాలీవుడ్ నుంచి ఎత్తేశారు అంటూ రచ్చ రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా తెలుగు సినిమాల విషయంలో ఈ రచ్చ జాతీయ స్థాయిలో తెలిసిపోయింది. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూస్తున్నారంటే ఈ రచ్చ ఒక కారణం. సినిమా జయాపజయాలతో పని లేకుండా ముందే మనం ఇతర చోట్ల అబాసు పాలైపోతున్నాం. కారణం ఏదైనా ఇదంతా కాపీ క్యాట్ గోలకు సంబంధించిన రచ్చ.
తాజాగా సుకుమార్ నిర్మాతగా సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన కుమారి 21 ఎఫ్ చిత్రం ఫస్ట్ లుక్ ని కూడా కాపీ కొట్టేశారంటూ రచ్చ సాగుతోంది. ఓ ప్రముఖ రష్యన్ మ్యాగజైన్ చై - లాట్ కవర్ పేజీపై ముద్రించిన డిజైన్ నే సుక్కూ కాపీ కొట్టేశాడంటూ ఆధారాలు సహా చూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్ లో పక్క పక్కనే ఇమేజెస్ చూపిస్తూ కంపారిజన్ చెప్పేస్తున్నారు క్రిటిక్స్. ఓ అందమైన అమ్మాయి దోర దోర పెదవుల్ని ఫస్ట్ లుక్ లో చూపించి యూత్ ని ఆకట్టుకున్న సుకుమార్ ఇలా మ్యాగజైన్ కవర్ పేజీపై నుంచి ఎత్తేయడం ఏంటి? అంటూ విమర్శలొస్తున్నాయి.
అయితే ఇలాంటి విమర్శలు రొటీన్ అయిపోయాయి కాబట్టి మన ఫిలింమేకర్స్ కూడా వీటిని పట్టించుకో వడం మానేశారు. ఇదేమీ తప్పు కాదులే అన్నట్టే ఉంది వీళ్ల వ్యవహారం. ఇన్ స్పయిర్ అయితే తప్పేంటి?