Begin typing your search above and press return to search.
ఎలా చూసినా బెస్ట్ మూవీనే
By: Tupaki Desk | 5 Dec 2015 6:07 AM GMTసుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ నిర్మాతగా తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే లాభాల్లో ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమా 20 కోట్ల షేర్ వసూళ్ల మార్క్ ని తాకుతుందని ట్రేడ్ వర్గాలు ఆశలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో రిలీజైన చిన్న సినిమాల్లో పెద్ద విజయమిది. స్టార్ హీరోల సినిమాల్ని కొట్టే సినిమాగా రికార్డుల కెక్కింది. 40 కోట్ల బడ్జెట్ సినిమాలకు దక్కని వసూళ్లు ఈ సినిమాకి దక్కాయి మరి. అయితే ఈ విజయంలో జనాలదే కీలక పాత్ర. ఎందుకంటే.. ఈ సినిమాకు క్రిటిక్స్ అందరూ బిలో పార్ రేటింగ్స్ ఇస్తే.. మధ్య వయస్కులు మాత్రం పర్లేదు అన్నారు. కాని యూత్ కు సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. దానితో రేటింగ్సుతో రివ్యూలతో పని లేకుండా ధియేటర్లు కిటకిటలాడుతున్నాయి. 10 రోజుల్లోనే 10 కోట్ల షేర్ వచ్చేసింది.
ఇకపోతే.. రాజ్ తరుణ్ - హేబా పటేల్ కెరీర్ కి పెద్ద బోనస్ ఇది. హేబా పటేల్ ఇప్పటికే వరుసగా సినిమాలకు కమిటవుతోంది. రాజ్ తరుణ్ తన రేంజుని కోటి కి విస్తరించేశాడు. మునుముందు ఈ ఇద్దరూ టాప్ స్లాట్ పెర్ఫామర్స్ గా ఎత్తులకు ఎదిగేయడం ఖాయం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు కుమారి సినిమా టీమ్ ఎదుగుదలను శాసించింది. ఏ కోణంలో చూసినా ఇది ఈ ఏడాదిలోనే ది బెస్ట్ మూవీ అని చెప్పాల్సిందే.