Begin typing your search above and press return to search.
కుమారి ఊపిరి పోస్తోంది
By: Tupaki Desk | 29 Nov 2015 3:30 PM GMTబ్రూస్ లీ సినిమాతో ఇండస్ట్రీ షేక్ అయిపోతుందని అంచనా వేశారు జనాలు. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని.. వంద కోట్ల మార్కును అందుకుంటుందని.. నాన్ బాహుబలి రికార్డుల్ని చెరిపేస్తుందని.. ఇలా ఎన్నెన్నో అంచనాలు ఆ సినిమా మీద. కానీ రికార్డుల సంగతి పక్కనబెడితే బయ్యర్లకు దారుణమైన నష్టాలు మిగిల్చింది ఆ సినిమా. ఇక అఖిల్ సినిమా మీద అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా తొలి సినిమాకే రికార్డు బిజినెస్ చేసిన అఖిల్.. రిలీజ్ తర్వాత కూడా అనేక రికార్డుల్ని బద్దలు కొడతాడనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా దారుణంగా బోల్తా కొట్టింది. ‘శ్రీమంతుడు’ తర్వాత ఇంకే పెద్ద సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేదు. ఐతే ఈ మూడు నెలల కాలంలో చిన్న సినిమాలే బాక్సాఫీస్ కు ఊపిరి పోశాయి.
మొన్న భలే భలే మగాడివోయ్ - నిన్న రాజుగారి గది- నేడు కుమారి 21 ఎఫ్.. మూడు సినిమాలూ చిన్న సినిమాలే. కానీ అవి సాధించిన విజయాలు మాత్రం చాలా పెద్దవే. భలే భలే మగాడివోయ్ పెట్టుబడి మీద దాదాపు నాలుగు రెట్ల షేర్ వసూలు చేస్తే.. ‘రాజుగారి గది’ కూడా ఇన్వెస్ట్ మెంట్ మీద మూడు రెట్లు కలెక్ట్ చేసింది. ఇక కుమారి కూడా ఆ రెండు సినిమాలకు దీటుగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే పది కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నెలలో ‘కుమారి..’తో పాటు ఆరేడు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఏది కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఈ వారం వచ్చిన సైజ్ జీరో, తను నేను సినిమాలకు కూడా టాక్ ఏమంత బాగా లేదు. కానీ కుమారి 21 ఎఫ్ మాత్రం రెండో వారంలోనూ దుమ్ముదులుపుతోంది. ఈ నెలలో కలెక్షన్లు లేక వెలవెలబోయిన బాక్సాఫీస్ కు ‘కుమారి 21 ఎఫ్’ ఊపిరి పోస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.17-18 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.