Begin typing your search above and press return to search.

ఈ సెక్సీ బాడీకి కారణం అతడే

By:  Tupaki Desk   |   13 Feb 2018 6:54 AM GMT
ఈ సెక్సీ బాడీకి కారణం అతడే
X
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత వారం రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరు ఉహించని విధంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమ్మడు నార్మల్ ఫోటో షూట్ ఇస్తేనే ఓ తరహాలో ఉంటుంది. ఇక బికినిలో పొజిచ్చేటప్పటికి హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాషన్ ప్రపంచంలో రకుల్ ఇచ్చిన ఆ హాట్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అయ్యారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో విజయాలు లేకపోవడంతో అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదు.

కానీ సడన్ గా బికినీ లుక్స్ లో కనిపించేటప్పటికి అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తంగా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే ఆ లుక్ లో అమ్మడు అంత సెక్సీగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా. ఒక వ్యక్తి ఉన్నాడు. రకుల్ జిమ్ వర్కౌట్స్ ఎక్కువగా చేస్తుంటుంది అని అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రముఖ జిమ్ ట్రైనర్ కునల్ గిర్ వద్ద గత కొంత కాలంగా రకుల్ ట్రైనింగ్ తీసుకుందట. అతని సూచనల ప్రకారం చేసి ఫిట్ నెస్ ని చాలా ఈక్వల్ గా మెయింటెన్ చేసింది. అందుకే తనకు ఈ తరహా సెక్సీ లుక్ వచ్చిందని రకుల్ ఒప్పుకుంది.

కునల్ ఎక్కువగా మోడల్స్ కి ఫిట్ నెస్ లో జిమ్ వర్కౌట్స్ చేయిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆయన దగ్గర చేరితే ఎలాంటి అమ్మాయి అయినా నాజూక్కా అయిపోతుందట. ఇక రకుల్ ప్రస్తుతం తన బాలీవుడ్ సినిమా అయ్యారి సినిమా రిలీజ్ పనుల్లో చాలా బిజీగా వుంది. ఆ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని చాలా రకాలుగా ప్రమోషన్స్ చేసింది. మరి అమ్మడి కష్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.