Begin typing your search above and press return to search.

ఈ న‌లుగురికి మామూలు పిచ్చి కాదు

By:  Tupaki Desk   |   13 Nov 2015 4:41 AM GMT
ఈ న‌లుగురికి మామూలు పిచ్చి కాదు
X
టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా ఫిట్ నెస్ ఫ్రీక్స్‌. అందం - ఆరోగ్యం ఈ రెండిటినీ పెర్ఫెక్ట్‌ గా మెయింటెయిన్ చేయ‌డానికి ఎంతో రిస్కు తీసుకుంటున్నారు. అంతేకాదు .. కొంద‌రైతే జిమ్మింగ్‌ - ఎక్స‌ర్‌ సైజుల కోసం ఓ ప‌ర్స‌న‌ల్ కోచ్‌ ని కూడా నియ‌మించుకుంటున్నారు. హైద‌రాబాద్ సిటీలో టాప్ సెల‌బ్రిటీ ట్రైన‌ర్‌ గా పేరు తెచ్చుకున్న కునాల్ గిర్ ఓ న‌లుగురు సెల‌బ్రిటీలు ఎలాంటి ఫిట్‌నెస్ మంత్రం పఠిస్తారో చెప్పుకొచ్చారు. విక్ట‌రీ వెంక‌టేష్ - ద‌గ్గుబాటి రానా - సుధీర్‌ బాబు - స‌మంత త‌న ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

వీళ్ల‌లో విక్ట‌రీ వెంక‌టేష్ వ‌య‌సులో కాస్త పెద్ద‌వాడు కాబ‌ట్టి త‌న‌కి త‌గ్గ‌ట్టే ఎక్స‌ర్‌ సైజుల్ని ప్లాన్ చేస్తున్నాన‌ని కునాల్ చెప్పారు. జాయింట్ పెయిన్స్ రాకుండా శ్ర‌ద్ధ తీసుకోవాలి. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టే ఆహారాన్ని ప్లాన్ చేయాలి. వెంకీకి కాస్త అజీర్తి ఉంది కాబ‌ట్టి ఫైబ‌ర్ ఉన్న ఆహారాన్నే ఎక్కువ తీసుకోమ‌ని సూచించాను. రెగ్యుల‌ర్‌ గా జిమ్ చేసే హీరోల్లో వెంకీ క‌మిట్‌ మెంట్ చాలా బావుంటుంది అని అన్నారు.

ఇక యంగ్ హీరోల్లో రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి కోసం రెడీ అవుతున్నాడు. మొద‌టి భాగంలో కంటే కాస్త డిఫ‌రెంటుగా రెండో భాగంలో క‌నిపించాల్సి ఉంది. అందుకోసం ఇప్ప‌ట్నుంచే భీక‌ర‌మైన క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. రానా చాలా ఎత్తుగా ఉంటాడు కాబ‌ట్టి త‌న‌కి షోల్డ‌ర్ కంటే బైసెప్స్‌ - ఆర్మ్‌ - చెస్ట్ వంటివి బాగా తీర్చిదిద్దితే బావుంటుంది. ప్ర‌స్తుతం వాటిపైనే కాన్స‌న్‌ ట్రేట్ చేశాడు.. అలాగే డైట్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. మ‌రో హీరో సుధీర్‌ బాబు అంతే శ్ర‌ద్ద‌గా వ్యాయామాలు చేస్తుంటారు. అత‌డు రెగ్యుల‌ర్‌ గా గంట సేపు జిమ్‌ లో గ‌డుపుతాడు. బైట షూటింగుల‌కు వెళ్లాల్సి ఉంటే రెండు గంట‌ల స‌మ‌యం జిమ్‌ కే కేటాయిస్తాడు. డైట్ ప‌రంగానూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు సుధీర్‌. షూటింగుకి వెళ్లే ముందు ప్రొటీన్ డైట్ ప్రిఫ‌ర్ చేస్తాడు.

అందాల క‌థానాయిక స‌మంత స్ర్టిక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తూ తేలిక‌పాటి ఎక్స‌ర్‌ సైజులు చేసేందుకు ప్రిఫ‌ర్ చేస్తుంటారు. ముఖ్యంగా లెగ్ ఎక్స‌ర్‌ సైజులు చేసేందుకు ప్లాన్ చేస్తారు. త్వ‌ర‌గా అల‌సిపోకుండా ఉండే క‌స‌ర‌త్తులు చేస్తారు. అంటూ కునాల్ సెల‌బ్రిటీ జిమ్మింగ్ గురించి చెప్పుకొచ్చారు.