Begin typing your search above and press return to search.

జెంటిల్మాన్ 2 : ఈ నయనతార కాదు మరో నయనతార

By:  Tupaki Desk   |   13 April 2022 8:13 AM GMT
జెంటిల్మాన్ 2 : ఈ నయనతార కాదు మరో నయనతార
X
మూడు దశాబ్దాల క్రితం వచ్చిన జెంటిల్మాన్‌ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు స్థాయిలో అప్పట్లో వసూళ్లను దక్కించుకుంది. శంకర్‌ దర్శకత్వంలో నిర్మాత కుంజుమోన్ జెంటిల్మాన్ సినిమాను నిర్మించాడు. అర్జున్‌ హీరోగా మధుబాల మరియు శుభశ్రీ లు హీరోయిన్స్ గా నటించిన జెంటిల్మాన్‌ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ పనులు జరుగుతున్న విషయం తెల్సిందే.

నిర్మాత కుంజుమోన్ రెండేళ్ల క్రితమే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించాడు. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అప్పటి జెంటిల్మాన్‌ సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా జెంటిల్మాన్ 2 ను తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై గత కొన్నాళ్లు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ డమ్‌ ఉన్న లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ను హీరోయిన్‌ గా ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం కు నిర్మాత కుంజుమోన్ తెర దించినట్లుగా కొత్త ప్రకటన చేసి ప్రతి ఒక్కరిలో మరోసారి ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు.

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారను కాకుండా ఈ సినిమాలో మరో నయనతార ను నటింపజేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. జెంటిల్మాన్‌ సినిమాలోకి నయనతార చక్రవర్తి ని హీరోయిన్ గా ఆహ్వానిస్తున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు. నిర్మాత కుంజుమోన్ సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటి వరకు ఈ సీక్వెల్‌ కు సంబంధించిన కథ ఏంటీ.. స్టార్స్ ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం అనూహ్యంగా క్లారిటీ ఇవ్వడం తో అసలు జెంటిల్మాన్‌ 2 సినిమా నేపథ్యం ఏంటి.. ఒక చిన్న సినిమా గా దీన్ని తెరకెక్కిస్తున్నారా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ ఏడాది చివరి వరకు వస్తాయో చూడాలి.