Begin typing your search above and press return to search.

100 కోట్ల సినిమాకు ఇలాంటి ట్రైలరా ?

By:  Tupaki Desk   |   9 July 2019 9:58 AM GMT
100 కోట్ల సినిమాకు ఇలాంటి ట్రైలరా ?
X
కన్నడ బాహుబలిగా బిల్డప్ ఇచ్చుకుంటూ సుమారు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందినట్టుగా అక్కడి మీడియాలో ప్రచారం జరిగిన మల్టీ స్టారర్ కురుక్షేత్ర ట్రైలర్ నిన్న విడుదలయింది. కెజిఎఫ్ తర్వాత ఆ స్థాయిలో కర్ణాటక సినిమా పేరు ప్రఖ్యాతులను నిలబెడుతుందన్న రేంజ్ లో దీని మీద అంచనాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా కురుక్షేత్ర ట్రైలర్ కు భీభత్సమైన నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు యూట్యూబ్ కామెంట్స్ లో విరుచుకుపడ్డారు. రెండు నిమిషాల ట్రైలర్ లో బ్యానర్ పేరుని చూపించడానికి నిముషం పైగా తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం పీక్స్ కు వెళ్ళింది.

ఇంత మంది తారలు ఉండగా నిర్మాత మునిరత్న గొప్పదనం చూపించుకోవడానికే కట్ చేసినట్టు ఉందని విమర్శలు గుప్పించారు. దెబ్బకు యుట్యూబ్ లో ఈ వీడియో ఉన్న పేజీలో కామెంట్స్ ని డిజేబుల్ చేసేసింది మ్యూజిక్ కంపెనీ. అక్కడి స్టార్ హీరో దర్శన్ హీరోగా నటించిన ఈ మూవీ మహాభారత గాధ ఆధారంగా ఇంకా చెప్పాలంటే మన దానవీరశూరకర్ణ రీమేక్ గా రూపొందింది. అలనాడు ఎన్టీఆర్ పోషించిన సుయోధనుడి పాత్ర స్ఫూర్తితోనే దర్శన్ గెటప్ ని బాడీ లాంగ్వేజ్ ని తీర్చిదిద్దారు.

యాక్షన్ కింగ్ అర్జున్ కర్ణుడిగా దివంగత నటుడు సుమలత భర్త అంబరీష్ భీష్ముడిగా కీలక పాత్రలు చేశారు. స్నేహ- సోను సూద్ - ప్రగ్య జైస్వాల్ - రవి శంకర్ - నిఖిల్ కుమార్ గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా దీన్ని అన్ని కీలక భాషల్లోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. ఇప్పుడీ నెగటివ్ రెస్పాన్స్ చూసి మరో ట్రైలర్ ని వదిలే ఆలోచనలో ఉంది టీమ్. ఇంత హైప్ ఉన్నప్పుడు బిల్డప్ కోసం కాకుండా కాస్త కాస్త కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడాల్సింది. ఏం చేస్తాం నష్టం అయితే జరిగిపోయింది. ఎలా రిపేర్ చేస్తారో చూడాలి