Begin typing your search above and press return to search.

సీనియర్‌ హీరోయిన్‌ ట్వీట్ల గోలేంటో?

By:  Tupaki Desk   |   22 Aug 2015 4:57 PM GMT
సీనియర్‌ హీరోయిన్‌ ట్వీట్ల గోలేంటో?
X
సెలబ్రిటీ అయినంత మాత్రాన సరిపోదు. బైటి ప్రపంచానికి రెగ్యులర్‌ గా టచ్‌ లో ఉండాల్సిందే. మేం కూడా రేసులో ఉన్నాం. లైమ్‌ లైట్‌ లోనే ఉన్నాం.. అని నిత్యం పాకులాడాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయకపోతే రేసులో వెనకబడినట్టే. అప్పటికే అభిమానులు ఉన్నా మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఒకసారి జీరో అయిపోయాక మళ్లీ గుర్తు చేసుకోవడానికి తంటా పడాలి.

మాజీలు, సీనియర్‌ లు అయితే జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇలాంటివాళ్లందరికీ ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ వంటి సామాజిక వేదికలు సులువైన యాక్సెస్‌ ని ఇస్తున్నాయి. రెగ్యులర్‌ గా ఏదో ఒక ట్వీట్‌ ఇవ్వడం ద్వారా అభిమానుల్ని టచ్‌ లో పెట్టుకోవడం ఏమంత కష్టంగా లేదు. ఇప్పటికే ట్విట్టర్‌ లో లక్షల్లో ఫాలోవర్స్‌ ని సంపాదించుకుంటున్న స్టార్లను చూస్తున్నాం. రెగ్యులర్‌ గా ఫ్యాన్స్‌ కబుర్లు వింటూ, వారికి అప్‌ డేట్స్‌ చెబుతూ ఫాలోవర్స్‌ ని పెంచుకుంటున్నారు. సొంత విషయాలకు ఇది పబ్లిసిటీని తెచ్చి పెడుతోంది.

అయితే ఇలా ట్విట్టర్‌ లో నిత్యం ట్వీట్లు ఇస్తూ బిజీగా ఉండే నటిగా సీనియర్‌ నటి ఖుష్బూ పేరు తెచ్చుకుంది. రోజుకి 20 ట్వీట్లు ఇస్తూ ఫాలోవర్స్‌ ని పెంచుకున్నారు ఖుష్బూ. బుర్రలోకి ఏ మెరుపులాంటి థాట్‌ వచ్చినా ఆన్‌ లైన్‌ లో పోస్ట్‌ చేసేస్తోంది. సెలబ్రిటీ స్టాటస్‌ లోనే ఉన్నానని గుర్తు చేస్తోంది. తనకి ఉన్న కాంటాక్ట్స్‌ దృష్ట్యా భవిష్యత్‌ లో ఒకవేళ రాజకీయాల్లో పాపులర్‌ అయ్యే ఆలోచన ఏదైనా ఉందేమో! అందుకే ఇలా చేస్తోందేమో!