Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసికి గుడ్ బై చెప్పేసింది

By:  Tupaki Desk   |   4 Dec 2017 1:00 PM GMT
అజ్ఞాతవాసికి గుడ్ బై చెప్పేసింది
X
పండగనాడు మరో పండగలా రాబోతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అజ్ఞాతవాసి కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో గాని ప్రస్తుతం సినిమా గురించి వస్తోన్న చిన్న న్యూస్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇకపోతే మరొకొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి కాబోతోంది.

సినిమాలో కీలక పాత్ర చేసిన ఖుష్బూ పాత్రకు సంబందించిన షూట్ రీసెంట్ గా పూర్తయ్యింది. ఈ సీనియర్ నటితో త్రివిక్రమ్ ఒక ఫోటోకి స్టిల్ కూడా ఇచ్చాడు. అలా తన షూటింగ్ పార్టును ముగించి గుడ్ బై చెబుతున్నాను అంటూ అమ్మడు సెలవిచ్చింది. ఇక కుష్బూ తన కెరీర్ లోనే ఒక మంచి పాత్రను చేసినట్లు కూడా తెలిపింది. అసలు సినిమాలో ఈ నటి పాత్ర చాలా కీలకం కానుందట. ముఖ్యంగా సినిమా సెకండ్ ఆఫ్ ఖుష్బూ నటన సినిమా స్థాయిని పెంచుతుందని తెలుస్తోంది.ఇంతకుముందు ఖుష్బూ స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అక్కయ్యగా కనిపించిన సంగతి తెలిసిందే.

మళ్లీ చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మొదటి సారి కథ చెప్పగానే ఒకే చేశారట. ఇక సినిమా దాదాపు ఫైనల్ షడ్యూల్ కి వచ్చేసింది. త్వరలో ఎండ్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ టీమ్ బిజీ కానుంది. సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.