Begin typing your search above and press return to search.

మతంపై మెగాస్టార్ అక్క కామెంట్స్

By:  Tupaki Desk   |   28 Jan 2016 11:19 AM IST
మతంపై మెగాస్టార్ అక్క కామెంట్స్
X
హీరోయిన్ గా ఖుష్ బూ అందరికి తెలిసినా.. స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ అక్క పాత్రలో నటించి ఈమె బాగా ఆకట్టుకుంది. ఆ మూవీలో సోదరిగా ఈమె నటనను మెగా ఫ్యాన్స్ ఎవరూ మర్చిపోలేరు. బేసిక్ గా యాక్టర్ అయిన ఈమె.. పొలిటికల్ గా కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తమిళనాడుకు సంబంధించి రాజకీయాల్లో కాంగ్రెస్ కు సంబంధించిన కీలకనేత కూడా. అంతేకాదు, ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. సినీ అభిమానులతోను, రాజకీయ అనుచరులతోనూ టచ్ లో ఉండడం ఖుష్ బూ స్టైల్.

ఇప్పుడు ఈమెపై మతపరమైన కామెంట్స్ చాలానే వచ్చాయి. వీటన్నిటికీ సమాధానాన్ని ఒకే ఒక్క ట్వీట్ తో ఇచ్చింది ఖుష్ బూ. 'నేను నాస్తికురాలిని, కానీ మతాన్ని విశ్వసించే వారి నమ్మకాన్ని గౌరవిస్తాను. నేను ఒక ముస్లింని అయినా.. హిందువును పెళ్లి చేసుకున్నా. అంతే కాదు నా సోదరుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడు' అంటూ ఖుష్ బూ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

తనపై వస్తున్న మతపరమైన రాజకీయ విమర్శలకు.. ఖుష్ బూ ఇచ్చిన రిటార్ట్ చాలా పవర్ ఫుల్ అని చెప్పాలి. అన్ని మతాలను కలుపుతూ చేసిన ఒకే ట్వీట్ తో అభిమానులకు ఆమెపై గౌరవం పెరిగిపోయింది. మా హీరోయిన్, నాయకురాలు నాస్తికురాలు మాత్రమే కాదని, మానవతావాది అని పొగిడేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఖుష్ బూ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.