Begin typing your search above and press return to search.
జాన్వీ సిస్టర్ ఎంట్రీకి లైన్ క్లియర్
By: Tupaki Desk | 26 Feb 2022 5:30 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవికి దేశ వ్యాప్తంగా వున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనదైన నటనతో స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారామె. అయితే ఆమె వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతోంది. మరాఠా సంచలన చిత్రం `సైరఠ్` ఆధారంగా రూపొందిన `ధడక్` సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఫరవాలేదనిపించింది. కానీ జాన్వీకి ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయింది.
గుంజన్ సక్సేనా, రూహీ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం దోస్తానా 2 - గుడ్ లక్ జెర్రీ - మిలి చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనూ పరిచయం కానుందంటూ వార్తలు వనిపిస్తున్నా అందులో ఎలాంటి నిజం లేదని ఎప్పటికప్పుడు బోనీ కపూర్ కొట్టి పారేస్తున్నారు. మంచి ప్రాజెక్ట్ కుదిరితే తప్పకుండా జాన్వీని తెలుగులో పరిచయం చేస్తానని గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్నాడు కానీ ఆ ప్రయత్నాలేవి ముందుకు సాగడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీలో జాన్వీ కపూర్ నటిస్తోందంటూ వార్తలు వినిపించాయి.
అయిలే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవల బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా వుంటే జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆ మధ్య న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ కోర్స్ ని పూర్తి చేసిన ఖుషీ కపూర్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో తండ్రి, నిర్మాత బోనీ కపూర్ .. ఖుషీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. `వలిమై` రిలీజ్ సందర్భంగా ఓ నేషనల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు.
ఖుషీ కపూర్ త్వరలోనే హీరోయిన్ గా ఓ బాలీవుడ్ మూవీతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందని, నటన విషయంలో ఖుషీ చాలా ఆసక్తిని చూపిస్తోందని, త్వరలోనే తను హీరోయిన్ గా పరిచయం అవుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏప్రిల్ నుంచి తను నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. అయితే అది ఎవరి సినిమా, డైరెక్టర్, హీరో ఎవరు అనే విషయాల్ని మాత్రం బోనీ కపూర్ వెల్లడించలేదు.
అయితే ఫార్హాన్ అక్తర్ సోదరి జోయా అక్తర్ త్వరలో షారుక్ ఖాన్ తనయ సుహాన ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందలతో ఓ మూవీని ప్లాన్ చేస్తోంది. ఇదే చిత్రం ద్వారా ఖుషీ కపూర్ కూడా పరిచయం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. జోయా అక్తర్ జిందగీ న మిలేగీ దుబారా, తలాష్ , గల్లీబాయ్ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.