Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి రెండో కుమార్తె రంగ ప్ర‌వేశం డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   26 Feb 2022 4:30 AM GMT
శ్రీ‌దేవి రెండో కుమార్తె రంగ ప్ర‌వేశం డేట్ ఫిక్స్
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ పెద్ద స్టార్ గా ఎదిగేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాపా బోనీక‌పూర్ .. శ్రీ‌దేవి బెస్ట్ ఫ్రెండ్ క‌ర‌ణ్ జోహార్ ఇరువురూ క‌లిసి జాన్వీ కెరీన్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ డెబ్యూ ఎప్పుడు? ఖుషీ ఎంట్రీ ఎలా ఉండ‌బోతోంది? అంటూ తెలుసుకునేందుకు అభిమానులు ఎగ్జ‌యిట్ అయిపోతున్నారు.

అలాంటి వారికి ఇది శుభ‌వార్త‌. ఖుషీ ఎంట్రీకి ఎట్ట‌కేల‌కు డేట్ ఫిక్స‌య్యింది. త‌న సినిమా ఏప్రిల్ లో లాంచ్ కానుంది. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్త‌యింది. ఇక కొన్ని నెలలుగా బోనీ కపూర్ త‌న కుమార్తె మూవీ కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బోనీ- శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ .. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో కలిసి తొలిసారిగా నటించబోతున్నారని పుకార్లు వినిపించాయి.

జోయా అక్తర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్చీస్ హిందీ అనుసరణ కోసం ఈ ముగ్గురూ కలిసి ప‌ని చేయ‌నురని ఊహాగానాలు వైర‌ల్ అయ్యాయి. వర్ధమాన నటులు ..చిత్రనిర్మాత ఇంకా పుకార్లకు ఆన్స‌ర్ ఇవ్వ‌క‌పోయినా కానీ.. ఖుషీ తొలి ప్రాజెక్ట్ ను ఈ ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళుతున్నామ‌ని బోనీ ధృవీకరించారు.

గతంలో జాన్వీ- ఖుషీ కూడా నటనలో తన కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు బోనీ ధృవీకరించారు. ఖుషీకి ఇప్పటికే సోషల్ మీడియాలో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ వేసవిలో ఖుషి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ప్ర‌ముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఖుషీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. మీకు మరిన్ని వివ‌రాలు చెప్ప‌లేను. దీని గురించి త్వరలో మీకు తెలుస్తుంది.. అని వ్యాఖ్యానించారు.

ఒక తండ్రిగా నేను అర్జున్ తో సినిమాలు చేస్తాను. జాన్వీతో పాటు ఖుషీతో కూడా చేస్తాను. అర్జున్ - జాన్వీ ఇప్పటికే ఒక స్థాయిలో ఉన్నారు. కెరీర్ ని వారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారికి అవసరమైనప్పుడు నేను ఎల్లప్పుడూ అక్కడే ఉంటాను. అదే సమయంలో మేము సినిమాలు చేసే విధానం.. అన్ని విషయాల గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం.

సహజంగానే నా వార‌సుల‌కు నా ఇన్ పుట్ లు ఉన్నాయి. అది తండ్రిగా మరియు నిర్మాతగా అవ‌స‌రం. నా అనుభవంతో ఏది సరైనదో వారికి చెప్తాను కానీ.. అంతిమంగా నిర్ణయం వారిదే. నేను వారితో కమర్షియల్ అంశాల గురించి మాట్లాడతాను. అయితే తుది నిర్ణయం వారిదే” అన్నారాయన.

ఖుషీ కపూర్ ని తాను లాంచ్ చేయడం లేదని గతంలో బోనీకపూర్ చెప్పాడు. గత సంవత్సరం బాంబే టైమ్స్‌తో మాట్లాడుతూ.. తన కుమార్తెను మరొక బ్యాన‌ర్ ద్వారా లాంచ్ చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఎందుకంటే (అతను) ఆమె తండ్రిగా ఆ ప‌ని చేయ‌డు. వేరొక సౌక‌ర్య‌మైన నిర్మాత ద్వారా మాత్ర‌మే త‌న కుమార్తెను లాంచ్ చేయాల‌ని కోరుకున్నారు. ఇప్పుడు అదే జ‌ర‌గ‌నుంది.