Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కైపెక్కిస్తున్న కైరా

By:  Tupaki Desk   |   22 Jan 2018 8:32 AM GMT
ఫోటో స్టోరి: కైపెక్కిస్తున్న కైరా
X
మొన్నటి వరకు ఐటెమ్ సాంగ్స్ చేస్తే కొంత మంది తారలకు అంతగా గుర్తింపు వచ్చేది కాదు. అందంతో మైమరిపిస్తోంది అంటే ఎదో అలా చూసినపుడు గుర్తుంచుకునేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఐటెమ్ సాంగ్స్ సుందరిమణుల లుక్స్ షాక్ ఇస్తున్నాయి. చెసింది ఒక్క సాంగ్ అయినా సరే సోషల్ మీడియాలోకెక్కి మంచి కిక్ ఇస్తున్నారు. ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సరే వారి అందాలతో ఫాలోవర్స్ కౌంట్ ని కూడా పెంచేసుకుంటున్నారు.

అయితే అదే తరహాలో ఇప్పుడు కైరా దత్ కూడా తన టాలెంట్ తో అందరి చూపును తన వైపుకు తిప్పుకుంటోంది. ఈ భామ ఎక్కడ ఫొటో పోస్ట్ చేసిన తెగ వైరల్ అవుతోంది. గతంలో అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాలో భూచాడే భూచాడే అనే సాంగ్ లో తన హాట్ స్టెప్పులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొన్న బాలయ్య పైసా వసూల్ సినిమాలో కూడా కైరా స్పెషల్ సాంగ్ తో విజిల్స్ వేయించింది. రీసెంట్ గా ఇగో మూవీలో కూడా ఓ పాటకు చిందులేసింది.

ఇకపోతే అసలు మ్యాటర్ లోకి వస్తే కైరా రీసెంట్ గా దిగిన ఒక సెల్ఫీ ని చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా అందమైన సోయగాల ఎత్తు పల్లాలు కనిపించే విధంగా స్టిల్ ఇవ్వడం చూసి కసిగా కైపెక్కిస్తోంది అంటున్నారు అమ్మడి ఫాలోవర్స్. అమాయకంగా ఉన్న ఆమె చూపులు కూడా ఏదో మాయ అన్నట్లుగా ఉండడంతో హాట్ సెల్ఫీ కి ఓ కళ వచ్చింది. ఇక కైరా ఈ ఇయర్ కూడా బిజీ కానుంది. బాలీవుడ్ లో అలాగే సౌత్ లో ఆఫర్స్ అందుకునే విధంగా ఈ సెక్సీ లేడీ ప్లాన్ చేసుకుంటోంది.