Begin typing your search above and press return to search.

ఆడ పులిని అంటూ సొంత డ‌బ్బా

By:  Tupaki Desk   |   21 Sep 2019 8:00 AM GMT
ఆడ పులిని అంటూ సొంత డ‌బ్బా
X
డిఫెక్టు గాడే.. భ‌లే డిఫెక్టు గాడే.. క‌నెక్టు అయితే ఇక డిస్క‌నెక్ట్ కాడే..! అంటూ రేసుగుర్రం లాంటి బ‌న్నితోనే స్టెప్పులేసిన ఐటెమ్ భామ గుర్తుందా? .. బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అయిన ఈ అమ్మ‌డి హొయ‌లు కుర్ర‌కారును బాగానే క‌వ్వించాయి.

ఒక్క ఐటెమ్ తో ఊపేస్తే చాలు అలా టీవీ సిరీస్ లు.. వెబ్ సిరీస్ లు.. బుల్లితెర‌- వెండి తెర ఛాన్సులు ఎన్న‌యినా ఇట్టే ప‌ట్టేయొచ్చు! అనేందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం ఈ హాటీ. కెరీర్ ఆరంభ‌మే రేసుగుర్రం- పైసా వ‌సూల్ లాంటి క‌మ‌ర్షియల్ చిత్రాల్లో ఐటెమ్ గాళ్ గా అద‌ర‌గొట్టింది. పేరు కైరా ద‌త్. హైటు 5.2. సురేంద‌ర్ రెడ్డి- పూరి లాంటి హాట్ షాట్ డైరెక్ట‌ర్ల క‌ళ్లో ప‌డి ఛాన్సులు అందుకున్న ఈ బ్యూటీని ఆ త‌ర్వాత ఎందుక‌నో స‌రైన ఆఫ‌ర్ వ‌రించ‌లేదు సౌత్ లో. ఇప్ప‌టికి ఆ రెండు స్పెష‌ల్ సాంగ్స్ యూట్యూబ్ లో వేడి పెంచుతూనే ఉన్నాయి.

ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత హిందీ టీవీ సిరీస్ `సీఐడీ`లో న‌టించింది. అటుపై జుల్ ఫిక‌ర్-కేలెండ‌ర్ గ‌ర్ల్స్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో న‌టించి అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం విదేశాల్లో జాలీ ట్రిప్ లో ఉన్న కైరా ద‌త్ తాజా ఫోటోషూట్ నుంచి అదిరిపోయే ఫోటోని రివీల్ చేసింది. టూపీస్ బికినీలో వ‌య్యారాల వ‌డ్డ‌న‌లు చేసిన ఈ ఫోటో వేడెక్కిస్తోంది. ఫోటోని షేర్ చేసి దానికి జోడించిన కామెంట్ వేడెక్కిస్తోంది. ఈ అమ్మ‌డు త‌న‌ను తాను రాయ‌ల్ బెంగాళ్ టైగ్రెస్ (ఆడ పులి) అంటూ పొగిడేసుకుంది. పెద్ద పులి చార‌ల్ని పోలిన ఆ బికినీ డ్రెస్ లో ఓ రేంజులో క‌వ్విస్తోంది కానీ మ‌రీ ఇలా పులి గిలి అన‌డ‌మే బాలేద‌ని అమ్మ‌డిపై కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజా బికినీ లుక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అమ్మ‌డి టీజింగ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.