Begin typing your search above and press return to search.

ఆ రొమాంటిక్ సినిమాకు 6 ఆస్కార్లు

By:  Tupaki Desk   |   27 Feb 2017 7:07 AM GMT
ఆ రొమాంటిక్ సినిమాకు 6 ఆస్కార్లు
X
89వ అకాడమీ అవార్డులు ప్రధానోత్సవం యథావిథిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి అందరి కళ్ళూ 14 నామినేషన్లు సాధించిన ''లా లా ల్యాండ్‌'' సినిమాపైనే ఉన్నాయి. ర్యాన్ గాస్లింగ్ మరియు ఎమ్మా స్టోన్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ కావ్యంను.. డ్యామియన్ చెజాల్ అనే యువదర్శకుడు రూపొందించాడు. ఇంతకీ ఈ సినిమా ఎన్ని అవార్డులు గెలిచిందో తెలుసా?

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుతో తన ఖాతాను ఓపెన్ చేసిన లా లా ల్యాండ్.. ఆ తరువాత 5 అవార్డులను గెలుచుకుంది. మొత్తంగా 6 అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్.. ఉత్తమ దర్శకుడిగా డ్యామియన్ చెజాల్ తమ సత్తా చాటితే.. ఉత్తమ ఒరిజినల్ స్కోర్.. అలాగే ఉత్తమ సాంగ్ విభాగాలలో కూడా లా లా ల్యాండ్ ఆస్కార్లు కొట్టేసింది. అలాగే లైనస్ సాంగ్రెన్ కు ఉత్తమ సినిమాటోగ్రాఫీ అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఉత్తమ చిత్రంగా ముందు లా లా ల్యాండ్ పేరును పొరపాటను ప్రకటించారు అకాడమీ వారు. ఆ తరువాత సదరు అవార్డు మూన్ లైన్ సినిమాకు వెళ్ళింది.

మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అభిమానులు అందరూ వచ్చిన 6 అవార్డులకూ హ్యాపీ అయినా కూడా.. ఇప్పటివరకు రికార్డుల పరంగా చూసుకుంటే.. టైటానిక్.. బెన్ హర్.. లార్డ్ ఆఫ్‌ ది రింగ్స్ చిత్రాలు ఏకంగా ఒక్కొక్క సినిమా 11 అకాడమీ అవార్డులు సాధించాయి. ఆ రికార్డును లా లా ల్యాండ్ టచ్ చేయలేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/