Begin typing your search above and press return to search.

చైతూ మూవీలో బాబ్రీ మ‌సీద్ బాంబ్ బ్లాస్ట్?

By:  Tupaki Desk   |   20 May 2022 8:30 AM GMT
చైతూ మూవీలో బాబ్రీ మ‌సీద్ బాంబ్ బ్లాస్ట్?
X
ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యాల త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి విజ‌యం సాధించే స‌త్తా ఏ సినిమాకి ఉంది? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి. ఖాన్ లు ఈ ఫీట్ వేస్తారా? లేక సౌతిండియా ట్యాలెంట్ ముందు చ‌తికిల‌బ‌డ‌తారా? అంటూ బాలీవుడ్ మీడియానే వ‌రుస క‌థ‌నాల‌తో షంటేస్తోంది.

అయితే దంగ‌ల్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో 1000 కోట్లు పైగా ప్ర‌పంచవ్యాప్త‌ వ‌సూళ్లు అందుకున్న న‌టుడిగా అమీర్ ఖాన్ కి అంతో ఇంతో గౌర‌వం ఉంది. అత‌డు న‌టించిన `లాల్ సింగ్ చద్దా` త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. ఈ సినిమాతో అతడు వెయ్యి కోట్ల క్ల‌బ్ ని అందుకుంటాడా? అన్న చ‌ర్చా సాగుతోంది. ఇందులో అమీర్ ఖాన్- కరీనా కపూర్ - నాగ‌చైత‌న్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం 90ల నాటి కీలకమైన చారిత్రక అధ్యాయం ఆధారంగా ప్రధాన సన్నివేశాన్ని తెర‌కెక్కించారు.

లాల్ సింగ్ చద్దా ఒక కీలకమైన ప్లాట్ ఎలిమెంట్ ని కలిగి ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇది బాబ్రీ మ‌సీద్ బాంబ్ బ్లాస్ట్ అన్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. అమీర్ ఖాన్- చైత‌న్య పాత్ర‌ల‌ను భారతీయ చరిత్రలోని ప్రధాన సంఘటనల ద్వారా అనుసంధానించ‌డం ఆస‌క్తిని పెంచే ఎలిమెంట్ అన్న టాక్ వినిపిస్తోంది. 90ల నాటి కీలకమైన చారిత్రక అధ్యాయం (పేలుళ్లు) నేపథ్యంలో 1994 ఆస్కార్-విన్నింగ్ మూవీ .. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ ఆధారంగా రూపొందించారు. ఇది అమెరికన్ చరిత్ర వార్షికోత్సవాల ద్వారా టామ్ హాంక్స్ పేరులేని పాత్ర తో క‌థ‌ను న‌డిపించారు.

లాల్ సింగ్ చద్దా క‌థ కూడా ఇంచుమించు అలానే ఉన్నా కానీ భార‌తీయ‌త‌ను యాడ‌ప్ చేసార‌ట‌. ఇప్పుడు పరిశ్రమ గుస‌గుస‌ల ప్ర‌కారం.. లాల్ సింగ్ ప్రధాన కథాంశం 90ల నాటి చారిత్రక అధ్యాయం నేపథ్యంలో దాని ప్రధాన కథానాయకుడిని పిట్ చేస్తూ క‌థ‌ను అల్లుకున్నార‌ని తెలిసింది.

భారతీయ చరిత్రలోని కీలక ఘట్టాలతో అమీర్ పాత్ర రంజింప‌జేస్తుంది. సినిమా సీక్వెన్స్ లో ఇలాంటి ఎలిమెంట్ ఇంకెక్క‌డా కనిపించద‌న్న టాక్ వినిపిస్తోంది. లాల్ సింగ్ చద్దాను ఇప్పుడు ఆగష్టు 11 న విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రం ముందుగా ఏప్రిల్ 14న పెద్ద తెరపైకి రావాల్సి ఉంది. KGF చాప్టర్ 2 - బీస్ట్ లతో పోటీబ‌రిలో దిగాల్సి ఉన్నా అప్పుడు వాయిదా ప‌డింది. సినిమా పెండింగ్ ప‌నులు కూడా ఒక ప్రధాన కారణం కావడంతో ఏప్రిల్ 14న విడుదల చేయడం కష్టతరంగా మారింది. లాల్ సింగ్ చద్దా చిత్రానికి సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అతుల్ కులకర్ణి రచించారు.