Begin typing your search above and press return to search.
'జబర్దస్త్' పై చర్యలకు 'గల్ఫ్' డిమాండ్!
By: Tupaki Desk | 15 Oct 2018 3:39 PM GMTఓ ప్రముఖ చానెల్ లో ప్రసారమవుతోన్న జబర్దస్త్ షోకు ఓ పక్క టీఆర్పీ రేటింగులు విపరీతంగా వస్తున్నాయి. ఆ షో నుంచి చాలా మంది కమెడియన్లు వెండితెరకు పరిచయమయ్యారు. అందులో కొందరు స్టార్ కమెడియన్లుగా చలామణీ అవుతున్నారు. అయితే, ఆ షోకు మరో పార్శ్వం ఉంది. జబర్దస్త్ షో కు మరో పక్క అదే స్థాయిలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఆ షో లో కామెడీ మోతాదు మించుతోందని, షో లో కొన్ని సన్నివేశాలు జుగుప్సాకరంగా ఉన్నాయని చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలతో కలిసి ఆ షోను చూడలేకపోతున్నామని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దాంతోపాటు, కొన్ని సామాజిక వర్గాలు...వృత్తుల వారిని కించపరిచారని ఆ షో గతంలో వివాదాస్పదమైంది. తాజాగా అదే తరహాలో, జబర్దస్త్ పై మరో వివాదం రేగింది. గల్ఫ్ కార్మికులపై చేసిన ఓ స్కిట్ వివాదాస్పదమైంది.
గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానించేలా ఆ స్కిట్ ఉందని జగిత్యాలలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గల్ఫ్ కార్మికులను అవమానించేలా అసభ్యకరమైన పదజాలంతో ఆ స్కిట్ చేయడంపై వారు మండిపడుతున్నారు. ఆ స్కిట్ చేసిన జబర్దస్త్ కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను వారు దహనం చేశారు. ఆ షో ప్రసారం చేసిన ఈటీవీ, మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పోలీసులకు తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గతంలో కూడా కల్లు గీత కార్మికులను అవమానించేలా స్కిట్ చేసినందుకు వేణుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.