Begin typing your search above and press return to search.
జక్కన్న శిష్యుడి సినిమా 1.45 గంటలే
By: Tupaki Desk | 25 Jan 2016 7:30 PM GMTఈ మధ్య సినిమాల లెంగ్త్ విషయంలో చాలా జాగ్రత్త పడిపోతున్నారు దర్శక నిర్మాతలు. సాధ్యమైనంత చిన్న సినిమా అయితేనే ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారని స్రవంతి రవికిషోర్ లాంటి సీనియర్ నిర్మాత సైతం తన కొత్త సినిమా ‘నేను శైలజ’ నిడివిని 2.35 గంటల నుంచి 2.13 గంటలకు తగ్గించినట్లు చెప్పారు. అందులోనూ థ్రిల్లర్ - క్రైమ్ కామెడీ తరహా సినిమాలైతే రెండు గంటలకు అటు ఇటుగా నిడివి సెట్ చేసుకుంటున్నారు.
తాజాగా రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల రూపొందించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమానైతే కేవలం గంటా 45 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వదులుతున్నారు. సినిమా తీయడమే అంత తక్కువలో తీశారా.. లేక ఎడిటింగ్ లో లెంగ్త్ కట్ చేశారా అన్నది తెలియదు కానీ.. ఇంటర్వెల్ బ్రేక్ కలుపుకున్నా థియేటర్లోకి వెళ్లిన రెండు గంటలకే ప్రేక్షకుడు బయటికి వచ్చేయబోతున్నాడు.
‘అందాల రాక్షసి’ జంట నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ క్రియేటివ్ ప్రోమోలతో జనాల్ని బాగానే ఆకట్టుకుంది. చాన్నాళ్లుగా మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ఈ సినిమాను ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ మధ్య లావణ్య నటించిన సినిమాలన్నీ హిట్టవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు కూడా ఆమె లక్ తోడై పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో చూడాలి.