Begin typing your search above and press return to search.
రెంటికి చెడ్డ రేవడి.. లేడీ ఫైర్ బ్రాండ్ పరిస్థితి దారుణం
By: Tupaki Desk | 30 May 2022 8:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ను చాలా మంది పొగరుబోతు అంటారు. ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది. తాను ఒక మంచి ప్రతిభ ఉన్న నటిని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతో మంది స్టార్ కిడ్స్ ను వెనక్కు నెట్టి స్టార్ గా ఎదిగాను. అలాంటి నేను పొగరు చూపించకుండా ఎలా.. స్టార్ కిడ్స్ కొందరు చూపించే పొగరు కంటే తాను చూపించే పొగరు తక్కువే అన్నట్లుగా కంగనా ఎన్నో సందర్బాల్లో వ్యాఖ్యలు చేసింది.
పొగరు అనేది సినిమాల విషయంలో ఏం జరుగుతుందో కంగనా రనౌత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. ఆమె తన సినిమాల పట్ల పూర్తి పట్టు తనకే కావాలని... తన పాత్ర డామినేషన్ ఉండాలని భావించడం.. ఇంకా తాను అనుకున్నట్లుగానే సినిమా ఉండాలి అనుకోవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ప్లాప్ లు చవిచూడాల్సి వస్తుంది.
గతంలో కమర్షియల్ సినిమాలను.. హీరోలకు జోడీగా హీరోయిన్ పాత్రలను చేసిన కంగనా రనౌత్ ఈమద్య కాలంలో దాదాపు అన్ని కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ప్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈమె హీరోలకు జోడీగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించినా కూడా ఇప్పుడు ఆమెకు ఆ అవకాశాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు.
హీరోయిన్ గా ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎదిగింది. నటిగా ఆమెను ఏ ఒక్కరు విమర్శించడానికి లేదు. కాని ఆమె ఎంపిక చేసుకుంటున్న సినిమాలు మరియు ఆ క్రమంలో ఆమె మాట్లాడుతున్న మాటలు.. తన సినిమాల ప్రమోషన్ సమయంలో చేస్తున్న వ్యాఖ్యల కారణంగా కెరీర్ లో రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి అన్నట్లుగా కంగనా పరిస్థితి మారిపోయింది.
తాజాగా కంగనా నటించిన ధాకడ్ సినిమా దారుణమైన పరాజయం మూట కట్టుకుంది. వంద కోట్ల వసూళ్ల టార్గెట్ తో విడుదల అయిన ధాకడ్ సినిమా కనీసం 10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. కంగనా ధాకడ్ సినిమాకు ఓటీటీ లు పదుల కోట్ల ఆఫర్లు ఇచ్చారు. కాని కంగనా మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమా ను థియేట్రికల్ రిలీజ్ చేసింది.
ఇప్పుడు ఓటీటీ లు కనీసం పది కోట్లకు కూడా ధాకడ్ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎంతో కొంతకు తీసుకోవాలంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి. కంగనా పై రూపాయి పెడితే పావలా కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ నిర్మాతలు ఇప్పటికే ఒక క్లారిటీ కి వచ్చారు. అందుకే ఆమెతో సినిమా అంటేనే బాబోయ్ అన్నట్లుగా చాలా మంది వెనక్కు వెళ్తున్నారు.
ముందు ముందు అయినా కంగనా తన దుడుకు స్వభావం తగ్గించుకుని బాలీవుడ్ లో సినిమాలు చేస్తే కెరీర్ లో మళ్లీ నిలదొక్కుకోవచ్చు. లేదంటే మరి కొన్నాళ్లలో కంగనా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.