Begin typing your search above and press return to search.

ఔను ఇది ఎంగేజ్ మెంట్‌ రింగే

By:  Tupaki Desk   |   11 Aug 2021 4:47 AM GMT
ఔను ఇది ఎంగేజ్ మెంట్‌ రింగే
X
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు సస్పెన్స్‌ కు తెర దించింది.. పుకార్లకు చెక్ పెట్టింది.. మీడియాలో వస్తున్న వరుస కథనాలకు ఒక స్పష్టత ఇచ్చింది. విఘ్నేష్‌ శివన్ తో ప్రేమ పెళ్లి విషయమై గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న చర్చ విషయమై ఆమె స్పందించింది. వీరి పెళ్లి అయ్యిందని కొందరు.. సహజీవనం సాగిస్తున్నారు అంటూ కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం విఘ్నేష్‌ శివన్ ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఆ ఫొటోకు జీవితం కోసం చేతి వేళ్లు కలిశాయి అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫొటోలో నయన్ తార మరియు విఘ్నేష్‌ లు చాలా అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్నారు. దాంతో ఇద్దరికి కూడా ఎంగేజ్ మెంట్‌ అయ్యిందని ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఆ విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఎట్టకేలకు లేడీ సూపర్‌ స్టార్‌ తనకు ఎంగేజ్ మెంట్‌ అయ్యిందని.. ఇది ఎంగేజ్ మెంట్ రింగే అంటూ తన చేతి వేలికి ఉన్న రింగ్‌ ను చూపించింది.

ఈ వారంలో నయనతార నేత్రికన్‌ సినిమా డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ లో డైరెక్టర్ రిలీజ్ కాబోతుంది. నయనతార ఈ సినిమాలో అంధురాలి పాత్రలో కనిపించింది. సహజంగా ప్రమోషన్ కార్యక్రమాలపై ఆసక్తి చూపించని నయనతార ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించింది కనుక ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యింది. తమిళ ప్రముఖ ఛానెల్‌ విజయ్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈమె క్లారిటీ ఇచ్చింది. విఘ్నేష్‌ శివన్ తో పెళ్లి విషయమై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఔను మాది ఎంగేజ్ మెంట్‌ పూర్తి అయ్యిందని నయన్‌ రింగ్‌ చూపించడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఇంకా పూర్తిగా ప్రసారం కాలేదు. ఆ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో మాత్రమే రిలీజ్ చేశారు. నయన్ పెళ్లి విషయమై ఫుల్‌ క్లారిటీ ఇచ్చి ఉంటుందని అంతా ఆసక్తిగా ఉన్నారు.

నయనతార మొదటి సారి ఎంగేజ్ మెంట్‌ గురించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్త కథనాలు నిజమే అని ఒప్పుకున్నట్లయ్యింది. వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌ గా మారింది. ఇక పెద్ద ఎత్తున అంచనాలున్న నేత్రికన్‌ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున నయన్‌ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. తెలుగు లో కూడా అదే తేదీన డబ్బింగ్‌ వర్షన్‌ విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా సూపర్‌ హిట్ అయితే నయనతార క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే ఈ అమ్మడు 4 నుండి 5 కోట్ల రూపాయల పారితోషికంను తీసుకుంటూ ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ అంతకు మించి పారితోషికంను తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.