Begin typing your search above and press return to search.
'తొలిసారి ప్రేమలో పడినవారికి ఎనర్జీ ఇస్తాం'
By: Tupaki Desk | 20 Jan 2015 3:30 PM GMTఈ రోజుల్లో ఐ లైక్ యు, ఐ లవ్ యు లాంటి మాటలకు అర్థాలు మారిపోయాయి. పదాల్ని సరైన పద్ధతిలో ఉపయోగించడం లేదు. నిజమైన ప్రేమ లేదిప్పుడు. అందుకే సిసలైన ప్రేమను తెరపై చూపించాలనుకున్నాం. ప్రేమకు పూర్తి అర్థాన్నిచ్చే సినిమా చేయాలనుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తొలిసారి ప్రేమలో పడినవారికి ఎనర్జీ ఇచ్చే సినిమా ఇది'' అంటున్నారు లగడపాటి శ్రీధర్.
ఆయన సమర్పణలో రామలక్ష్మీ సినీక్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష నిర్మించిన సినిమా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. సుధీర్‌బాబు-నందిత జంటగా నటించారు. ఆర్.చంద్రు దర్శకుడు. పాటల్ని ఈనెల 25న విజయవాడలో ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ చేయనున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ సంస్థ 10వసంతాల్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజవుతున్న చిత్రమిది.
ఈ సందర్భంగా శ్రీధర్ ఆయన కార్యాలయంలో ముచ్చటిస్తూ...''పదేళ్ల సినీప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాం. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీలోనూ సినిమాలు నిర్మించాలన్నది నా ఆశ. తెలుగు పరిశ్రమలో గౌరవం పెంచే సినిమాలే తీయాలనుకుంటున్నా. తెలుగు సినిమా 100కోట్ల క్లబ్‌లో చేరుతున్న ఈ శుభవేళ మంచి సినిమాల్నే అందించాలన్నది నా తాపత్రయం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చక్కని ప్రేమకథా చిత్రం. మంచి కథతో పాటు కదీర్‌బాబు కలం బలం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. హరి సంగీతం, చంద్రశేఖర్ కెమెరా ప్రధాన బలాలు. ఆర్.చంద్రు దర్శకత్వ ప్రతిభ అస్సెట్'' అన్నారు.
సుధీర్ ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. 18 వయసు నుంచి 26 వయసుకి ఎదిగే కుర్రాడిగా కనిపిస్తాడు. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకుని పెద్ద స్టార్‌గా నిలుస్తాడు. చంద్రు ఈ చిత్రాన్ని కన్నడలో ఛార్మినార్ పేరుతో తెరకెక్కించి పెద్ద విజయం అందుకున్నాడు. కన్నడ ప్రభుత్వ అవార్డు 'రాజ్య ప్రసస్థి'ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా హీరో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు. తెలుగులోనూ సుధీర్‌బాబుకి పురస్కారం దక్కుతుందని ఆశిస్తున్నా'' అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక రెండు చోట్లని కలుపుతూ, గౌరవించాలని విజయవాడలో ఆడియోని నిర్వహిస్తున్నాం. సక్సెస్ మీట్‌లు హైదరాబాద్‌లోనే పెడతామని శ్రీధర్ తెలిపారు.