Begin typing your search above and press return to search.
పవన్ ను తెగ పొగిడేసిన లగడపాటి
By: Tupaki Desk | 11 May 2018 11:17 AM GMTపేరున్న నిర్మాత లగడపాటి శ్రీధర్. ఇప్పటికే ఎన్నో సినిమాలను ఆయన ప్రొడ్యూస్ చేశాడు.నా పేరు సూర్య సినిమా నిర్మాత కూడా ఆయనే. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్. ఎప్పుడూ సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి మాట్లాడని శ్రీధర్ పవన్ ను తెగపొగిడేశాడు. అది కూడా హీరోగా కాదు... ఎదుగుతున్న రాజకీయనాయకుడిగా.
మే 4న నాపేరు సూర్య సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా కూడా సూపర్ హిట్ కొట్టకపోయినా బాగానే ఉందన్న టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఆ మీట్‌కు ప్రత్యేక అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో కచ్చితంగా ఒక దేశభక్తికి సంబంధించిన పాట ఉంటుందని గుర్తు చేశాడు. పవన్ దేశ ప్రజలకు దేశానికి సేవ చేయడం కోసం తన సక్సెస్ ఫుల్ కెరీర్‌ను వదిలేశారని చెప్పాడు. దేశాన్ని మార్చగల గొప్ప శక్తి కలవాడు పవర్ స్టారేనని అన్నాడు. భవిష్యత్తులో కచ్చితంగా దేశంలో గేమ్ ఛేంజర్ పవన్ ఆవిర్భవిస్తాడని తెలిపాడు.
పవన్ కలలు కంటున్న ఆశయాన్ని చేరుకోవడానికి దేశ ప్రజలకు సేవ చేసేందుకు తాను ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. సక్సెస్ మీట్ కాస్త పవన్ భజనగా మారిపోయిందని అంటున్నారు కొందరు సినీ జనాలు. కాకపోతే ఆ సినిమా కూడా మెగా ఫ్యామిలీకి చెందినదే కాబట్టి... పవన్‌ను స్తుతించడంలో తప్పేముందని అడిగే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా పవన్ రాజకీయ రాక తెలుగు రాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.