Begin typing your search above and press return to search.

ఫ్లాప్ సినిమాను ఎందుకు కొట్టేస్తాం?

By:  Tupaki Desk   |   2 Feb 2018 5:32 AM GMT
ఫ్లాప్ సినిమాను ఎందుకు కొట్టేస్తాం?
X
ఇప్పుడు సినిమాలపై కాపీ ఆరోపణలు పెరుగుతున్నాయి. అజ్ఞతవాసి తర్వాత ఆన్ లైన్ జనాల హంగామా మరీ ఎక్కువగా ఉంది. ఏదైనా ఓ టీజర్ రాగానే.. లేదా సినిమా స్టోరీ గురించి ఓ వివరం తెలియగానే.. ఆ కాన్సెప్ట్ కు సంబంధించిన హాలీవుడ్ మూవీతో లింక్ పెట్టేస్తున్నారు.

ఇప్పుడు సెట్స్ పై అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య విషయంలో కూడా ఇలాంటి హంగామానే జరుగుతోంది. ఆవేశం గల ఓ ఆర్మీ పర్సన్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని.. ఫస్ట్ ఇంపాక్ట్ లో చెప్పేశారు. ఇలాంటి కథను వెతికివెతికీ.. హాలీవుడ్ మూవీ ఆంటోన్ ఫిషర్ కి కాపీ అనే ప్రచారం చేసేస్తున్నారు. 'మా సినిమా టీజర్ లో హీరో ఓ ఆర్మీ పర్సన్ అని.. యాంగర్ మేనేజ్మెంట్ సమస్యను ఎదుర్కుంటున్నాడని చెప్పామంతే. కొన్ని సెకన్ల టీజర్ చూసి.. చాలామంది ఇది కాపీ అని.. ఫ్రీమేక్ అని జడ్జ్ మెంట్ చేసేస్తున్నారు. కానీ మా కథ పూర్తిగా విభిన్నమైనది. ఏ సినిమాకి కాపీ కాదు' అంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్.

ఆ హాలీవుడ్ చిత్రాన్ని తాను కూడా చూశానని.. అదో ఆటోబయోగ్రఫీ కాగా.. తమ చిత్రం పూర్తిగా కల్పిత కథ అంటున్న శ్రీధర్.. అయినా ఫ్లాప్ సినిమాను ఎందుకు కొట్టేస్తాం అంటూ ప్రశ్నించారు. కాపీ ఆరోపణల దెబ్బకి ఆవేశంలో ఫ్లాప్ సినిమాను కొట్టేస్తామా అన్నారాయన. అంత మాత్రాన హిట్ సినిమా అయితే కొట్టేస్తారని అర్ధం చేసుకోకూడదు. టాలీవుడ్ లో కంప్లీట్ గా ఆర్మీ నేపథ్యంతో ఓ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఓ వైవిధ్యభరితమైన కథతోనే బన్నీ వస్తున్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.