Begin typing your search above and press return to search.
నెరవేరుతున్న మంచు లక్ష్మి డ్రీమ్
By: Tupaki Desk | 12 Feb 2022 3:30 PM GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా `అనగనగా ఓ ధీరుడు` చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి మంచు. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కీలక నటిగా, ప్రధాన నాయికగా పలు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.
తనదైన నటనతో ఆకట్టుకుంటున్న లక్ష్మి మంచు నిర్మాతగానూ రాణించి విజయాల్ని సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న ఆమె డ్రీమ్ తాజాగా నెరవేరబోతోంది. మంచు లక్ష్మి తాజాగా ఓ చిత్రాన్ని ప్రారంభించారు.
ఇందులో విశేషంగా ఏంటంటే తొలిసారి తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి నటించబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ జోష్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి క్లాన్ నివ్వగా, మంచు మనోజ్ కెమెరా స్విఛాన్ చేశారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ ని అందజేశారు. మలయాళ నటుడు సిద్ధిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రచయిత, డైరెక్టర్ డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తుండగా, ఛాయాగ్రహణం సాయి ప్రకాష్, సంగీతం ప్రియదర్శన్ సుబ్రమణ్యం అందిస్తున్నారు.
ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని, పద్మశీ డా. మోహన్‌బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో నటిస్తున్నారని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని.. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. `ఈ రోజు నేను జీవించాలని కలలు కనే రోజు. నేను మొదటి సారి మా నాన్నతో కలిసి స్క్రీన్ ని పంచుకోబోతున్నాను. నాకు మార్గ నిర్దేశం చేసినందుకు..ఈ రోజు కోసం నన్ను చాలా సమర్ధ్యంగా మార్చినందుకు ఈ విశ్వానికి, నా దేవదూతలకు, నా పూర్వీకులకు కృతజ్ఞురాలిని` అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.