Begin typing your search above and press return to search.
లక్ష్మీ.. రకుల్.. ఎక్సపోజింగ్ సంగతేంటి??
By: Tupaki Desk | 1 April 2017 5:26 PM GMTఈరోజు టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చోటుచేసుకుంది. నిన్న రిలీజైన దర్శకుడు వంశీ 'ఫ్యాషన్ డిజైనర్' సినిమా పోస్టర్ పై ఒక సెటైర్ వేసింది లక్ష్మీ మంచు. ''అమ్మాయిలను ఇలా అబ్జెక్టిఫై చేయడం ఎప్పుడు మానేస్తాం??'' అంటూ అక్కడికి ఈ పోస్టర్ ఒక్కటే టాలీవుడ్లో హీరోయిన్లను సెక్స్ వస్తువులుగా చూపిస్తోంది అన్నట్లు కలరింగ్ ఇచ్చింది. దీనిపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. అవును.. ''ఒక ప్రక్కన ఈ విధంగా హేళన చేస్తూ మరో ప్రక్కన సినిమాలు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ల గురించి మనం మాట్లాడుతుంటాం'' అంటూ ట్వీటేసింది.
అయితే వీరి ట్వీట్లు నెటిజన్లకు మాత్రం ఏ విధంగానూ రుచించలేదు. మొన్ననే 'ధృవ' సినిమాలో పరేషానురా అంటూ అత్యంత పొట్టి బట్టలు వేసుకుని బీచులో బురదలో పొర్లేసింది రకుల్. అదంతా ఏంటి మరి? అంటూ నెటిజన్లు వాయించి పాడేశారు. అంతేకాదు.. లక్ష్మీ మంచు కూడా తను తీసిన సినిమాల్లో తాప్సీ వంటి హీరోయిన్లతో విపరీతంగా ఎక్సపోజింగ్ చేయించడం గురించి నెటిజన్లు కడిగిపాడేశారు. ఇక కొందరైతే మొన్ననే ఈడోరకం ఆడోరకం అంటూ తమ్మడు రెండు పెట్టలున్నాయ్ అనే పాటలో సోనారికా బడోరియా అండ్ హెబ్బా పటేల్ తో నాటు డ్యాన్సులు చేయిస్తూ.. వారి పిరుదలపై తబల వాయించడం సబబేనా అంటూ నెటిజన్లు పంచ్ ల మీద పంచులు వేశారు.
ఇంకా కొందరైతే.. ''మీ ఫ్యామిలీ బ్రాహ్మణులపై వారి భార్యలపై వల్గర్ జోక్స్ వేస్తే లేదు కాని.. ఈ పోస్టర్ తో నీకు తంటాలు వచ్చాయా'' అని అడిగేశారు కూడా. ఈ మొత్తం యవ్వారంపై స్పందించిన నిర్మాత మధుర శ్రీధర్.. ''కేవలం క్యారక్టర్ చేసే పనిని మాత్రమే అక్కడ డిపిక్ట్ చేయడం జరిగింది. ఈసారి మీ పాయింట్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త పోస్టర్లను రూపొందిస్తాం'' అంటూ సెలవిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/