Begin typing your search above and press return to search.

ఈరోజు నాకు పీడకలే అంటున్న మంచులక్ష్మి

By:  Tupaki Desk   |   23 Jun 2016 7:30 PM GMT
ఈరోజు నాకు పీడకలే అంటున్న మంచులక్ష్మి
X
గత కొన్ని నెలలుగా టీవీ షో మేముసైతం కోసం మంచులక్ష్మి చాలా బిజీబిజీగా గడిపేసింది. ఒకవైపు సహాయం కోసం ఎదురుచూసే పేదలు.. మరోవైపు సెలబ్రిటీలు వీరిని సమపాళ్లలో హ్యాండిల్ చేస్తూ దిగ్విజయంగా మేముసైతంను పూర్తి చేసింది ఈ మంచు వారసురాలు. ఆ కార్యక్రమానికి సంబంధించి షూటింగ్ ఎపిసోడ్ పూర్తవడంతో ఇప్పుడు రిలాక్సింగ్ గా ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకుంది.

షూటింగ్ బిజీ అయిపోగానే యూరోప్ చుట్టొచ్చేలా ప్లాన్ చేసుకున్న మంచు లక్ష్మి.. ఇప్పటికే అక్కడకు చేరిపోయింది. అయితే.. అసలు సమస్య అక్కడే మొదలైంది. ఆమె నిజానికి ఇటలీలోని ఫ్లోరెన్స్ కు వెళ్లాల్సి ఉంది. ముందుగా లండన్ కి వెళ్లి అక్కడి నుంచి ఇటలీకి వెళ్లాల్సి ఉండగా.. లండన్ లో ఫ్లైట్ మిస్ కావడంతో.. ఎయిర్ పోర్టులో వెయిట్ చేయడం చాలా సమస్య అయిందట. 'నా జీవితంలో ఈ రోజు ఒక పీడకల లాంటిది' అని ఆమె స్వయంగా ట్వీట్ చేసిందంటే ఎంత ఇబ్బంది పడిందో అర్ధమవుతుంది.

'లండన్ లో విపరీతమైన వరదల కారణంగా ఫ్లోరెన్స్ ఫ్లైట్ మిస్ అయ్యాను. సాయంత్రం నాలుగింటి వరకూ ఎయిర్ పోర్టులోనే కూర్చోవాలి. నా ఐప్యాడ్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఏం రోజో ఇది. ఇక్కడే ఎయిర్ పోర్టులో నేలపై పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ తన ఇబ్బందిని ట్వీట్ ద్వారా తెలిపింది మంచు లక్ష్మి.