Begin typing your search above and press return to search.
మాన్ స్టర్: లక్ష్మీ మంచు డాడీ లక్కీ సింగ్
By: Tupaki Desk | 9 Oct 2022 11:23 AM GMTయాక్షన్ డ్రామా `పులిమురుగన్` లాంటి బ్లాక్ బస్టర్ తో సత్తా చాటిన జోడీ లాల్ - వైశాఖ్. ఇప్పుడు ఈ జోడీ తెరపై మరో ప్రయోగం చేస్తోంది. మాన్ స్టర్ అనే ప్రయోగాత్మక థ్రిల్లర్ కోసం మరోసారి వీరిద్దరూ కలిసారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రక్తి కట్టించింది. ఇందులో మరో రెండు విషయాలు విశేషంగా అలరించాయి. ఈ ట్రైలర్ లో తెలుగు నటి లక్ష్మి మంచు ఓ కీలక పాత్రలో కనిపించింది. నేరం చేసిన లక్ష్మీని విచారిస్తున్న పోలీస్ అధికారిణికి చెమటలు పట్టేస్తున్నాయి. ఇంతలోనే మా డాడీ లక్కీ సింగ్ అంటూ లక్ష్మీ డైలాగ్ తో మోహన్ లాల్ కొత్త గెటప్ రివీలైంది. అతడే సింగ్ ఈజ్ బ్లింగ్ గెటప్ లో దిగిపోవడంతో లక్ష్మీ మంచు పాత్రకు వెయిట్ ఎక్కువే వుందని అర్థమవుతోంది. ఆశ్చర్యకరంగా లక్ష్మీ మలయాళంలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని అర్థమవుతోంది. ఆ భాషలో కూడా యుఎస్ యాక్సెంట్ స్పష్ఠంగా బయటపడడం విచిత్రం.
మాన్ స్టర్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిన ఇన్వెస్టిగేటివ్ డ్రామా తో తెరకెక్కింది. లక్కీ సింగ్ అనే పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు. సిక్కు గెటప్ కి పక్కాగా సూటయ్యాడు అతడు. తలపాగా ధరించిన సిసలైన సింగ్ లుక్ లో కనిపించాడు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతకుమించి లక్ష్మీ పాత్ర ఆసక్తిని పెంచుతోంది. మాన్ స్టర్ లో తన పాత్ర మూవీ ఆద్యంతం ఉంటుందా లేదా చూడాలి. మలయాళంలో ఆమెకు ఇదే తొలి చిత్రం. హనీ రోజ్- సిద్ధిక్- సుదేవ్ నాయర్- గణేష్ కుమార్- లీనా ఇతర కీలక పాత్రలు పోషించారు.
ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో మాఫియా అంశాలు సస్పెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబావూరు మాన్ స్టర్ ను నిర్మించారు. మొదట్లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీపావళి పండుగ సీజన్ లో మాన్ స్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.