Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులు కథను ఇచ్చేశా-మంచు లక్ష్మి
By: Tupaki Desk | 21 Aug 2016 1:30 PM GMTకొన్నిసార్లు ఎవరో చేయాల్సిన ఫ్లాప్ సినిమా ఇంకెవరి చేతికో వెళ్తుంది. అలాగే కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన హిట్ సినిమా ఇంకొకరి చేతికి వెళ్లిపోతుంది. ‘పెళ్లిచూపులు’ రెండో కోవకు చెందుతుంది. ఇది నిజానికి మంచు లక్ష్మి నిర్మించాల్సిన సినిమా. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నపుడే అతడి టాలెంట్ గుర్తించి లక్ష్మి కథ చెప్పమంటే ‘పెళ్లిచూపులు’ కథ చెప్పాడతను. మంచు లక్ష్మికి నచ్చింది. ఆమె దగ్గరే స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆమె చేతి నుంచి ఆ ప్రాజెక్టు వెళ్లిపోయింది. రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సురేష్ బాబూ హ్యాండ్ వేశాడు. ఇద్దరూ భారీ లాభాలు అందుకున్నారు.
ఇంతకీ పెళ్లిచూపులు మీ చేతినుంచి ఎలా వెళ్లిపోయిందని మంచు లక్ష్మిని అడిగితే.. ‘‘నేను కథకు చాలా ప్రాధన్యమిస్తా. పెళ్లిచూపులు కథ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేద్దామనుకున్నా. దానికి స్ర్కిప్ట్ వర్క్ నా దగ్గరే జరిగింది. ఐతే స్క్రిప్టును అరడజను మంది పెద్ద హీరోల దగ్గరకు పంపించాను. ఎవ్వరూ చేయటానికి ఇష్టపడలేదు. చిన్న హీరోలతో సినిమా తీసి దాన్ని విడుదల చేసే శక్తి నాకు లేదు. మళ్లీ ఎవరినైనా అడగాలి. దాంతో ఆ కథను వేరే వాల్లకు ఇచ్చేశా’’ అని చెప్పింది లక్ష్మి. ఇక తన కొత్త సినిమా ‘లక్ష్మీబాంబు’ గురించి చెబుతూ.. ‘‘సినిమా పూర్తయింది. దాని ప్రొడ్యూసర్ చాలా హ్యాపీగా ఉన్నారు. మొదట ఆయనను చాలామంది భయపెట్టినట్లున్నారు. నా వైపు నుంచి కూడా ఒక సమస్య ఉంది లెండి. నాకు ఒక పట్టాన కథలు నచ్చవు. పైగా ఏది పడితే అది చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని లక్ష్మి అంది.