Begin typing your search above and press return to search.
కైలాస గిరిపై మెగా-మంచు డాటర్స్
By: Tupaki Desk | 1 Sep 2019 5:49 AM GMTకుదిరితే ప్రపంచ విహారం.. కుదరకపోతే కైలాస విహారం.. నిరంతరం ఏదో ఒక విహారం చేయకపోతే సెలబ్రిటీలకు బోర్ కొట్టదూ? అందుకే ఎప్పుడూ ఏదో ఒక పర్యటనతో బిజీగా ఉండాలి. రియాలిటీ షోలు బిజీ షెడ్యూల్స్ అంటూ ఉద్యోగంలోనే బోలెడంత అలసిపోతున్నారు. దీని నుంచి రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి.
అందుకేనేమో.. మంచు డాటర్ లక్ష్మీప్రసన్న హిమాలయాల పర్యటనలో ఉన్నారు. ఇటీవలే థాయ్ ల్యాండ్ లో `రియల్ హీరోస్` అనే రియాలిటీ షోని ముగించుకుని అటుపై లాంగ్ వెకేషన్ కి వెళ్లారు. అయితే మంచు లక్ష్మి తో కలిసి మెగాస్టార్ కుమార్తె సుశ్మిత ఈ వెకేషన్ కి వెళ్లడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితమే నేపాల్ వెళ్లి అట్నుంచి కైలాస పర్వతం.. మనస సరోవరం వెళ్లారట. టిబెట్ లో `లాస` అనే ప్రాంతాన్ని కూడా విజిట్ చేసుకున్న అనంతరం ఒక ఆర్డర్ ప్రకారం ఇవన్నీ సందర్శించుకున్నారట. ప్రఖ్యాత పుటాలా ప్యాలెస్ `లాస`లో ఉంది. అది దళైలామా నివాస స్థలంగా ఉండేది ఒకప్పుడు. ఆ ప్యాలెస్ ని సందర్శించాలన్నది లక్ష్మీ మంచు డ్రీమ్. ఇప్పటికి ఆ డ్రీమ్ నిజమైంది. అలాగే కైలాస పర్వతానికి వెళ్లడం ఇది మూడోసారి అని తెలిసింది. మొత్తానికి మంచు కొండల్లో మంచు వారమ్మాయి విహారం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది.
టాలీవుడ్ లోనే మంచు డాటర్ అరుదైన ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న ప్రతిభావని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ.. అక్కినేనీస్.. నందమూరీస్.. ఘట్టమనేనీస్.. దగ్గుబాటీస్ వీళ్లందరితో చక్కని సత్సంబంధాల్ని మెయింటెయిన్ చేయడం మంచు డాటర్ ప్రత్యేకత. అందుకే ఇలా రకరకాల వెకేషన్స్ పేరుతో వెళుతున్నప్పుడు తన స్నేహితులతో కలిసే ప్లాన్ చేస్తుంటారు.
లక్ష్మీ మంచు `రియల్ హీరోస్` అనే రియాలిటీ షో చేస్తూనే ఇతరత్రా ప్రాజెక్టులపైనా దృష్టి సారించారట. ఆ ప్రాజెక్టుల వివరాలు కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఒకవైపు సుశ్మిత సైరా నరసింహారెడ్డికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. అక్టోబర్ 2న వస్తున్న ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ గ్యాప్ లోనే ఇలా మంచు డాటర్ తో కలిసి హిమాలయాల విజిట్ కి వెళ్లారన్నమాట.