Begin typing your search above and press return to search.
మంటలు పెట్టిన మంచు లక్ష్మీ టకీలా ట్వీట్
By: Tupaki Desk | 2 May 2021 9:45 AM GMTనటి కం నిర్మాత .. టాలీవుడ్ ఆల్ రౌండర్ మంచు లక్ష్మీ ఇటీవల రకరకాల కారణాలతో ట్విట్టర్ లో ట్రోలింగుకి గురవుతున్న సంగతి తెలిసిందే. సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఎన్నో సంగతుల్ని ట్వీట్ చేస్తున్న లక్ష్మీ మంచు నేటి ఉదయం మరో టీజింగ్ ట్వీట్ తో ట్రోలర్స్ ఫైరింగ్ కి కారణమయ్యారు.
``ఉదయమే మూడు టకీలా షాట్లు కొట్టేసి ఆ తర్వాత ఒక బ్లాక్ కాఫీ తాగగలరా.. జస్ట్ ఆస్కింగ్!!`` అంటూ ట్వీట్ చేశారు. దీనికి నెటిజనుల నుంచి స్పందన అంతే అనూహ్యంగా ఉంది. బయట జనాలు చనిపోతూ పరిస్థితి ప్యానిక్ గా ఉంటే మీరు ఉదయమే టకీలా షాట్ల గురించి మాట్లాడతారా? అంటూ నిలదీస్తున్నారు.
ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు చనిపోతున్నారని .. ఇలాంటి సమయంలో టకీలా షాట్స్ - బ్లాక్ కాఫీ గురించి ఆమె ఆందోళన చెందుతున్నారని. మీరు ఏది తాగాలనుకుంటే అది తాగండి.. కానీ ట్వీట్లు వద్దు! అంటూ ఒక నెటిజన్ ట్రోల్ చేశారు. ప్రస్తుతం COVID-19 సెకండ్ వేవ్ ప్రతిచోటా వినాశనం సృష్టిస్తుంటే సెలబ్రిటీలు ఇలాంటి టీజింగ్ ట్వీట్లు చేయడం సందర్భోచితం కాదనేది చాలామంది అభిప్రాయం. దానికంటే ఆక్సిజన్ సిలిండర్లను కరోనా రోగులకు సరఫరా చేయాల్సిందిగా కొందరు సూచిస్తున్నారు. ఇప్పుడున్న సన్నివేశంలో ఇలాంటి మెసేజ్ లు పెడితే ట్రోల్ చేస్తారు.. దానిని కాస్త పట్టించుకోండి మ్యాడమ్ అంటూ కొందరు సూచిస్తున్నారు.