Begin typing your search above and press return to search.

ప్లస్‌2 పాస్‌ అయ్యి పోయిందోచ్‌

By:  Tupaki Desk   |   26 May 2015 5:30 AM GMT
ప్లస్‌2 పాస్‌ అయ్యి పోయిందోచ్‌
X
గజరాజు (కుంకీ తమిళ్‌) సినిమాతో తెలుగుతెరకి పరిచయమైంది కేరళ కుట్టి లక్ష్మీమీనన్‌. తొలిసినిమాతోనే చక్కని అభినయనేత్రి అన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత విశాల్‌ సరసన వరుసగా మూడు సినిమాల్లో నటించింది. అంతేనా నల్లనయ్యతో ఎఫైర్‌ నడిపించిందన్న టాక్‌ కూడా కోలీవుడ్‌లో నడిచింది. అయితే అప్పటికే ప్లస్‌ 2 చదువుతోంది లక్ష్మీ. కాబట్టి టీనేజీలో ఇలాంటి ఆకర్షణ మామూలే అని లైట్‌ తీస్కున్నారంతా.

ఏదేమైనా ఇప్పుడు తను ప్లస్‌ 2 పాస్‌ అయిపోయింది. ఇటీవలే రిజల్ట్స్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని లక్ష్మీ ఎంతో ఆనందంగా చెప్పింది. అనదర్‌ రిలీజ్‌ ఇది. అయితే ఇది పూర్తిగా పర్సనల్‌. దేవుడి దయవల్ల ప్లస్‌ 2 పాసైపోయా. కష్టే ఫలి అన్నారు పెద్దలు. నా కష్టం ఫలించింది... అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఎలాగూ ఇంటర్‌ అయిపోయింది కాబట్టి డిగ్రీ డిస్టెన్స్‌లో పూర్తి చేస్తూనే, సినిమాలతో పూర్తిగా బిజీ అయిపోవచ్చు. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ వెతుక్కుని అప్లికేషన్‌ పెడితే సరి. అన్నట్టు లక్ష్మీ మీనన్‌ ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తుందో క్లూ ఇవ్వనేలేదు ఫేస్‌బుక్‌లో.