Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ బ్యూటీ.. బికినీ వేస్తానంటోంది

By:  Tupaki Desk   |   2 Oct 2016 8:00 AM GMT
ట్రెడిషనల్ బ్యూటీ.. బికినీ వేస్తానంటోంది
X
డిమాండింగ్ పొజిషన్లో ఉన్నపుడు హీరోయిన్లు ఎన్ని కట్టుబాట్లు పెట్టినా చెల్లిపోతుంది. ఐతే అవకాశాలు తగ్గాక మాత్రం ఆ కట్టుబాట్లు పక్కకు వెళ్లిపోతాయి. తన శైలికి నప్పని వేషాలు కూడా వేయక తప్పదు. తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. చాలా సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ అమ్మాయి బికినీ వేస్తానని అంటోంది. ఈ అమ్మాయి అవతారానికి అసలు ఆమెను బికినీలో అస్సలు ఊహించుకోలేం. కానీ ఆమె మాత్రం బికినీ వేయడానికి నేను రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. 15 ఏళ్ల వయసుకే హీరోయిన్‌ అయిపోవడమే కాదు.. శశికుమార్ లాంటి సీనియర్ సరసన ఆమె కథానాయికగా నటించింది. ఆ తర్వాత విశాల్ సరసన పల్నాడు.. ఇంద్రుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె కెరీర్లో మెజారిటీ సినిమాలు హిట్లే. ఐతే మధ్యలో ‘వేదాలం’ సినిమాలో అజిత్ చెల్లిగా నటించడం.. చదువు కోసం అని గ్యాప్ తీసుకోవడంతో హీరోయిన్ గా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాల మీద దృష్టిపెట్టినా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు.

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధం అని ప్రకటించింది లక్ష్మీమీనన్. అంతే కాదు.. తాను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునే టైంలోనే స్విమ్ సూట్ వేసుకున్నానని.. కాబట్టి తనకు బికినీ వేయడం పెద్ద ఇబ్బందేమీ లేదని.. అలాంటి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపింది. తన ఫిజిక్ కు మోడ్రన్ దుస్తులు నప్పవని ఒకప్పుడు చెప్పిన లక్ష్మీ ఇప్పుడిలా యు టర్న్ తీసుకోవడం ఆశ్చర్యమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/