Begin typing your search above and press return to search.
లక్ష్మీ పార్వతి ఎమోషనల్ అయ్యేలా చేసిన వర్మ
By: Tupaki Desk | 9 Jan 2019 5:18 PM GMTఒక వైపు బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను విడుదల చేసే ఏర్పాట్లలో ఉండగా, వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలోని ఎందుకు.. అంటూ పాటను విడుదల చేశాడు. నేడు ఎన్టీఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు వర్మ విడుదల చేసిన ఎందుకు పాట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా, ఎంతో మంది అందగత్తెలు ఉన్నా ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి ఎందుకు నచ్చింది, ఎంతగానో విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఎందుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు అంటూ సాగే ఈ పాటపై లక్ష్మీ పార్వతి స్పందించింది.
వర్మ ఎందుకు పాటపై లక్ష్మీ పార్వతి స్పందిస్తూ... పాట వింటూ ఎమోషన్ అయ్యాను - పాట నన్ను బాధించింది, పాట వింటున్న సమయంలో నన్ను విమర్శించినట్లుగా అనిపించినా, చివరకు అవన్నీ ప్రశ్నలంటూ వర్మ చెప్పాడు. అయితే పాట విన్న తర్వాత మాత్రం వర్మపై నాకున్న గౌరవం మరింత పెరిగింది. ఎన్టీఆర్ గురించి నిజాలు చెప్పే సత్తా, ధైర్యం ఆయనకు మాత్రమే ఉందని నాకు మరింతగా నమ్మకం కుదిరిందని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ నిర్మించిన ‘ఎన్టీఆర్’ చిత్రం నిజమైన బయోపిక్ కాదని, వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా సినిమా వచ్చిన తర్వాతే బయోపిక్ సంపూర్ణం అవుతుందని లక్ష్మీ పార్వతి తెలిపింది. కేవలం సినిమాలో హీరోగా ఎలా అయ్యాడు, డాన్స్ లు ఎలా చేశాడో చూపించడమే బయోపిక్ కాదు, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ పడ్డ కష్టాలను చూపించి, ఆ తర్వాత రాజకీయాల్లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఇబ్బందులు అన్ని చూపించినప్పుడే అది నిజమైన బయోపిక్ అవుతుందని లక్ష్మీ పార్వతి అంది.