Begin typing your search above and press return to search.
లక్ష్మీ పార్వతి నట ప్రవేశం?
By: Tupaki Desk | 22 Nov 2019 4:57 AM GMTనవరసనటసార్వభౌముడు.. అన్నగారు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి భాగస్వామ్యం తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆర్జీవీ సినిమానే తీశారు. ఒక రచయితగా ఎన్టీఆర్ జీవితకథను రాసేందుకు వెళ్లి అటుపై ఆయనకు కష్టకాలంలో అండగా నిలిచి.. చివరికి పెళ్లి బంధంతో జీవిత భాగస్వామి అయ్యి.. ఈ ప్రయాణంలో ఎన్నో సంగతులు తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎన్టీఆర్ మరణానంతరం రాజకీయ పార్టీని ప్రారంభించారు లక్ష్మీ పార్వతి. అటుపై ఎన్నో ఊహాతీతమైన పరిణామాలు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లో సేవలు అందిస్తున్నారు.
అయితే ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఇప్పుడు లక్ష్మీపార్వతి సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం సినీరాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ప్రస్తుతం లక్ష్మీపార్వతి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ మరణానంతరం ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న విబేధాలు నేపథ్యంలో లక్ష్మీ పార్వతి ప్రత్యర్ధి పార్టీకి మద్దతునిస్తూ వచ్చారు. ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ గెలుపు కోసం ఆమె తనవంతు పాత్రను పోషించారు.
ప్రస్తుతం లక్ష్మీ పార్వతి ప్రభుత్వంలో కీలక బాత్యలు చేపట్టి తనకంటూ సొంత ఐడెంటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వేళ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమవుతోందన్న వార్త హీటెక్కిస్తోంది. తాజాగా ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఢమరకం.. రాగల 24 గంటల్లో చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి త్వరలో 'రాధాకృష్ణ' అనే ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో లక్ష్మీ పార్వతి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పైసా వసూల్ ఫేం ముస్కాన్ సేథీ లీడ్ రోల్ పోషించనుంది. మరి ఈ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం ఏమిటి..? లక్ష్మీ పార్వతి రోల్ ఎలా ఉంటుంది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే 64 ఏళ్ల లక్ష్మీ పార్వతి ఇప్పుడు తెరపై కనిపంచడం టాలీవుడ్ సహా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.