Begin typing your search above and press return to search.

వాస్తవాలను చూపించినందుకు వర్మగారికి కృతజ్ఞతలు!

By:  Tupaki Desk   |   14 Feb 2019 10:33 AM GMT
వాస్తవాలను చూపించినందుకు వర్మగారికి కృతజ్ఞతలు!
X
కొన్నిపనులు చేసేందుకు కొందరే సెట్ అవుతారు. విశ్వనాథ్ స్టైల్లో ఉన్న డైరెక్టర్ నుంచి 'ఫలక్ నుమా దాస్' సినిమాను ఆశించడం ఎంత పొరపాటో.. వర్మ నుండి 'శంకరాభరణం' ఆశించడం అంతకంటే పెద్ద పొరపాటు. కానీ ఎన్టీఆర్ పై సినిమా తీసేందుకు సరైన వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా.. మరో మాట లేకుండా 'వివాదాస్పద దర్శకుడు' అనే పర్మనెంట్ ట్యాగ్ ఉన్న రామ్ గోపాల్ వర్మ పేరే చెప్పాల్సి ఉంటుంది. ఆయన పేరే మొదటి స్థానంలో ఉంటుంది.. అదే చివరి స్థానంలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిని టచ్ చేసేందుకు గుండె ధైర్యంతో పాటు టన్నుల్లో తిక్క కూడా ఉండాలి. ఆ క్వాలిటీస్ అన్నీ వర్మలో పుష్కలంగా ఉన్నాయి. కానీ అయన ఫామ్ లో లేడు కదా.. కరెక్ట్ గా తీస్తాడా అనే అనుమానం జనాల్లో ఉంది. ట్రైలర్ రిలీజ్ తో అనుమానాలు పూర్తిగా పటాపంచలయ్యాయి

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. ఇంతకంటే పచ్చిగా.. ఓపెన్ గా ఎవరూ ఎన్టీఆర్ చివరి దశను చూపించలేరు అన్నట్టుగా ఉన్నాయి ట్రైలర్ లో సీన్లు. అందుకే యూట్యూబ్ లో ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ సినిమా టైటిల్ ఏకంగా లక్షీ పార్వతి పైనే ఉంది. మరి ఆమె ట్రైలర్ చూసి ఎలా స్పందించారు? ట్రైలర్ చూడగానే ఆమె కంట తడి పెట్టుకున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ సినిమా ప్రారంభించే ముందు తిరుపతిలో "ఈ సినిమా గురించి లక్ష్మీ పార్వతి గారిని ఏమీ అడగను" అని వర్మ చెప్పిన విషయన్ని గుర్తు చేశారు. తనను ఒక్క విషయం కూడా అడగకుండా వర్మ అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆవిడ చెప్పారు.

ఈ చిత్రం కోసం వర్మ చాలామందిని సంప్రదించారని.. ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన అధికారులు.. ఎన్టీఆర్ ఇంట్లో పనిచేసిన వంటవాళ్ళు.. పనిమనుషులు.. ఇలా అందరినీ సంప్రదించి వివరాలు సేకరించారని.. ఆ తర్వాత కథ సిద్ధం చేసుకున్నారని తెలిపారు. ఈ సినిమా విషయంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని అన్నారు. "వాస్తవాలను చూపిస్తూఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు వర్మగారికి కృతజ్ఞతలు" అన్నారు