Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ మహానాయకుడిపై లక్ష్మీపార్వతి స్పందన
By: Tupaki Desk | 22 Feb 2019 8:35 AM GMTఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతీ స్టార్ హీరో బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు కథానాయకుడు, మహానాయకుడు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీసినా ఏ భాగంలోనూ తన ప్రస్తావన చూపించలేదని అన్నారు. తనను సినిమాలో చూపిస్తే ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహాన్ని కూడా మూవీలో ప్రస్తావించాల్సి వస్తుందని అది చూపించే ధైర్యం బాలకృష్ణకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేడు విడుదలైన మహానాయకుడిలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేయడం, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి, ముఖ్యమంత్రి కావడం వంటివి చూపించారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన సమయంలో తన వెన్నంటే ఉన్నతనను ఏ సినిమాలో చూపించలేదని లక్ష్మీపార్వతి అన్నారు. అయితే తాను ఈ సినిమాను చూడలేదని... కొందరు తనకు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు లేవని అన్నారు. దీని గురించి తనకు ముందే తెలుసని అన్నారు. చంద్రబాబుతో అంటకాడుగున్న బాలకృష్ణకు వాస్తవాలు చూపించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని కామెంట్ చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ కి జరిగిన ద్రోహన్ని బాలకృష్ణ ఏనాడో మరిచిపోయారని ఆరోపించారు.
ఈ రెండు భాగాల్లో ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని ఏమాత్రం చూపించలేదని, అందువల్లనే ఎన్టీఆర్ అభిమానులు, సగటు ప్రేక్షకుడు ఈ సినిమా పట్ల సరైన తీర్పునిచ్చారని విమర్శించారు. ఇక రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ జరిగిన అన్యాయం, అవమానాలను కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారని ఆమె అన్నారు. తాను ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
ఏదిఏమైనా మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు రాజకీయంగా పెను సంచలాన్ని సృష్టిస్తున్నాయి. మహానాయకుడిలో లక్ష్మీ పార్వతీ గురించి ప్రస్తావించకపోడం మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాలయ్యకు ఆ ధైర్యం చాలకనే చూపించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.