Begin typing your search above and press return to search.

23 ఏళ్ల ఆవేదన వర్మ అర్థం చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   9 March 2019 10:04 AM GMT
23 ఏళ్ల ఆవేదన వర్మ అర్థం చేసుకున్నాడు
X
వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్బంగా ట్రైలర్‌ 2 ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ పార్వతి పాల్గొంది. ఆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్మపై తన కృతజ్ఞతను తెలియజేసింది. తాను ఇన్నాళ్లుగా పడ్డ కష్టంకు, పడుతున్న ఆవేదనకు వర్మ న్యాయం చేశాడని లక్ష్మీ పార్వతి అభిప్రాయపడింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ... నాకు న్యాయం జరుగుతుందని - నా ఆవేదనను ఈ జన్మలో అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు. 23 ఏళ్ల పాటు నేను ఎంతో ఆవేదన అనుభవిస్తూ వస్తున్నాను. నాకు - నా భర్తకు జరిగిన అన్యాయంను కడుపులో దాచుకున్నాను. నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరని ఇంత కాలం భావించాను. నేను రామ్‌ గోపాల్‌ వర్మ గారికి రుణపడి ఉన్నాను. నేను ఇన్నాళ్ల పడ్డ ఆవేదనను వర్మ గారు అర్థం చేసుకున్నారు. ఈ చిత్రంతో అయినా నేను పడ్డ క్షోభ కాస్త అయినా బయటకు తెలుస్తుందని, అసలు నిజాలు బయటకు తెలియబోతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం మొత్తం కూడా లక్ష్మీ పార్వతి చుట్టు తిరుగుతుంది. ఎలాంటి సందర్బంలో ఎన్టీఆర్‌ కు ఆమె దగ్గర అయ్యింది, నందమూరి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి వివక్షను ఎదుర్కొంది అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ కు వెన్ను పోటు పొడిచన విషయాన్ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. అందుకు లక్ష్మీ పార్వతి చాలా సంతోషంగా ఉందని ఆమె మాటలతో అర్థం అవుతుంది.