Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కనిపించడం లేదు : లక్ష్మీ పార్వతి
By: Tupaki Desk | 27 Nov 2018 4:54 AM GMTబాలకృష్ణ - క్రిష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి కూడా లక్ష్మీ పార్వతి ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉంది. మొదట తన పాత్రను సినిమాలో అనుచితంగా చూపించినట్లయితే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించింది. ఇక చంద్రబాబు నాయుడు పాత్రను ఈ చిత్రంలో కీలకంగా చూపించడం ను కూడా ఆమె తప్పుబడుతూ పలు విమర్శలు చేసింది. తాజాగా మరోసారి ‘ఎన్టీఆర్’ బయోపిక్ గురించి లక్ష్మీ పార్వతి స్పందించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. సినిమాలో బాలయ్య లుక్ అచ్చు ఎన్టీఆర్ లా ఉందని అంటున్నారు. కాని నాకు మాత్రం బాలయ్య గెటప్స్ ఏమాత్రం ఎన్టీఆర్ తో పోలిక ఉన్నట్లుగా కూడా అనిపించడం లేదంది. ఎన్టీఆర్ ను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా బాలయ్యను ఎన్టీఆర్ గా ఒప్పుకోలేక పోతున్నట్లుగా లక్ష్మీ పార్వతి పేర్కొంది. ఎన్టీఆర్ సినిమాలో నిజాలు చెప్తారనే నమ్మకం నాకు లేదు. ఎన్టీఆర్ గురించి పూర్తిగా నిజాలు చూపించే దమ్ము - ధైర్యం కేవలం వర్మకే ఉందని లక్ష్మీ పార్వతి అభిప్రాయం వ్యక్తం చేసింది.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్టీఆర్ గురించిన నిజాలు మాట్లాడే దమ్ము కేవలం పోసాని కృష్ణ మురళికి మాత్రమే ఉందని - ఆయన ఏ విషయాన్ని అయినా నిర్భయంగా చెబుతాడు అంటూ లక్ష్మీ పార్వతి పేర్కొంది. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి తాను ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేశారు. అంత డబ్బు నా వద్ద ఉంటే నేనే సినిమా తీసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.