Begin typing your search above and press return to search.
'యాత్ర'లా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఉంటే..రాజకీయ కల్లోలమే
By: Tupaki Desk | 14 Feb 2019 1:34 PM GMTఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యాత్ర' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 'యాత్ర' చిత్రంతో జనాల గుండెల్లో వైఎస్ ఆర్ ఇంకా సజీవంగా ఉన్నాడని నిరూపితం అయ్యింది. వైఎస్ తీసుకు వచ్చిన పథకాలు - జనాల కోసం ఆయన పడ్డ తపన సినిమాలో చూపించడం జరిగింది. ఈ చిత్రం రాజకీయంగా కూడా ప్రభావం చూపడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అధికార పార్టీలో ఎక్కువగా ఎన్టీఆర్ వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ మరణంకు కొన్ని రోజుల ముందు పడ్డ అత్యంత బాధకర సంఘటనలు చూపించాడు. ట్రైలర్ లోనే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు ఆడుకున్నారో చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు వాడిని నమ్మడం అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఖచ్చితంగా జనాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ట్రైలర్ లోనే ఈ స్థాయిలో చూపించిన వర్మ ఇక పూర్తి సినిమాలో ఎన్టీఆర్ పడ్డ మానసిక వేదనను సంపూర్తిగా చూపడం ఖాయం. యాత్ర సినిమాలో ఎలా అయితే రాజశేఖర్ రెడ్డిని మరోసారి జనాలు చూశారో అలాగే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో కనుక నందమూరి తారక రామారావును మరోసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో కల్లోలం ఏర్పడటం ఖాయం అంటూ సినీ మరియు రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వర్మ తీసిన మూవీతో రాజకీయ కల్లోలం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.