Begin typing your search above and press return to search.

తెలంగాణ లో షోలు పడతాయా వర్మ?

By:  Tupaki Desk   |   28 March 2019 3:13 PM GMT
తెలంగాణ లో షోలు పడతాయా వర్మ?
X
ఆది నుంచి ఏదో ఒక వివాదంతో నలుగుతున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ ఇవాళ కోర్టు తీర్పుతో మళ్ళి స్పీడ్ బ్రేకర్ కు ఆగాల్సి వచ్చింది. అంతా సవ్యంగా ఉంది ఇంకే అడ్డంకులు లేవు అనుకుంటున్న తరుణంలో మంగళగిరి న్యాయస్థానం ఇచ్చిన ట్విస్ట్ పెద్ద షాకే మిగిల్చింది. ఒకవైపు హైదరాబాద్ సహా తెలంగాణ సినిమా ప్రియులను ఇంకా అయోమయం వీడలేదు.

ఇప్పటికే వేల సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొనేశారు. వాయిదా అంటే రీ ఫండ్ ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ ఇంతకు ముందే తెలంగాణ హై కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ షోలు పడతాయనే ఆశాభావంతోనే ఉన్నారు ప్రేక్షకులు. కాని ఇక్కడా వాయిదా తప్పకపోవచ్చని ట్రేడ్ అంచనా. దానికి చాలా స్పష్టమైన కారణం ఉంది

తెలంగాణా వ్యాప్తంగా సినిమా విడుదలైతే దానికి సంబంధించిన టాక్ తో పాటు మొత్తం జాతకం బయటికి వస్తుంది. అంతే కాదు ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తే ఏదో ఒక రూపంలో పైరసీ రాకుండా పోదు. అప్పుడు ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తే కొనేవారు ఉండకపోవచ్చు. పైగా ముందస్తు చేసుకున్న బిజినెస్ చాలా మటుకు తగ్గిపోతుంది. ఇది నిర్మాతకు నష్టం కలిగించేదే.

ఈ నేపధ్యంలో ఒక రాష్ట్రంలో విడుదల చేసి పక్క రాష్ట్రంలో తర్వాత చేద్దాం అనుకోవడానికి ఇది డబ్బింగ్ సినిమా కాదు. స్ట్రెయిట్ మూవీ. వర్మ ఆలోచనా ధోరణి ఇప్పుడు ఎలా ఉందో ఎవరి ఊహకు అందటం లేదు. ఉదయాన్నే ప్రసాద్ ఐ మ్యాక్స్ లో మొదలయ్యే షో సమయానికి దీని గురించి పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొన్ని గంటలేగా. వేచి చూద్దాం. సస్పెన్స్ మొత్తం వీగిపోతుంది.