Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఆవేదనే సినిమాలో చూపించాం

By:  Tupaki Desk   |   6 Feb 2019 9:55 AM GMT
ఎన్టీఆర్ ఆవేదనే సినిమాలో చూపించాం
X
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చివరి రోజుల్లో ప్రస్తావించించిన ఆవేదనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాట రూపంలో చూపించామని నిర్మాత రాకేష్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. తెలుగుదేశం పార్టీ నేతలు సినిమాలోని పాటపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన కోర్టును కోరాడు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టీడీపీ నేతలు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలోని ఓ పాటలోని పదాలు టీడీపీ నేతలను కించపరిచేలా ఉన్నాయని ఓ టీడీపీ ఎమ్మెల్యే వర్మపై కో్ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని పాటను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపకర్తలు కోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు.

ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జరిగిన అన్యాయం, చంద్రబాబు తీరుపై ఏ స్థాయిలో మాట్లాడారో కోర్టుకు వివరించారు. స్వయంగా ఎన్టీఆర్ తనకు జరిగిన దగా, కుట్రలపై వివరించారని.. ఆయన ఆవేదననే ఓ పాటలో చిత్రీకరించామని నిర్మాత పేర్కొన్నారు.. అలాగే ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాల్లో రాసిన అంశాలనే సినిమాలో చూపించామని పేర్కొన్నారు.

సినిమాలో చూపిస్తున్న పాట.. ఎన్టీఆర్ చనిపోకముందే కవి శ్రీశ్రీ రాశారని.. కేవలం టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడి మెప్పుకోసం టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. దీనిని కోర్టు గుర్తించి కేసును కొట్టివేయాలని లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఏ ఆదేశాలచ్చినా దానికి కట్టుబడి ఉంటామని సినిమా నిర్వాహకులు చెబుతున్నారు.

ఏదిఏమైనా ఈ సినిమాలోని పాటను ఉంచినా, డిలిట్ చేసినా టీడీపీ కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. వర్మ సినిమాలకు కంట్రవర్సీలే పబ్లిసిటిగా మారుతుంటాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నేతలు వర్మపై కోర్టుకు ఎక్కి ఆయన కావాల్సినంత పబ్లిసిటిని ఫ్రీగా చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న పనివల్ల ఆ పార్టీకి డ్యామేజ్ తప్ప వర్మకు పోయేదేమీ లేదని పైగా ఆయన అనుకున్నదే జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వర్మపై పోరాటాన్ని పక్కకుపెట్టి ఎన్నికలపై దృష్టిసారిస్తారో లేక వర్మపై పోరాటం అంటూ రచ్చ చేసుకుంటారో చూడాలి మరీ.