Begin typing your search above and press return to search.
లక్ష్మిస్ ఎన్టీఆర్ - తీరని కన్ఫ్యూజన్
By: Tupaki Desk | 28 March 2019 4:51 AM GMTఇంకో 24 గంటల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదటి ఆట పడనుంది. ఇప్పటికే హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మహా జోరుగా ఉన్నాయి. స్క్రీన్ కౌంట్ కూడా పెరుగుతోంది. అక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి విడుదల పరంగా ఎలాంటి చిక్కులు ఉండే అవకాశం లేదు. ఒకవేళ చిన్నా చితకా నిరసనలు ఉన్నా పటిష్టమైన పోలీస్ వ్యవస్థ అండగా ఉంది కాబట్టి ఏ సమస్యా లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇంత అనుకూలంగా లేదు.
ఇప్పటికే టిడిపి పార్టీ దీని విడుదల ఆపాల్సిందిగా రెండు పిటీషన్లు వేసింది. ఎలక్షన్ కమీషన్ క్లియరెన్స్ ఇవ్వడం గురించి ఒకటి పోలింగ్ అయ్యే దాకా రిలీజ్ ఆపాల్సిందిగా మరొకటి దాని ప్రతినిధులు దాఖలు చేశారు. అట్టే టైం లేదు కాబట్టి ఫైనల్ హియరింగ్ ఈ రోజు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబీటర్లు మాత్రం కాస్త ఆందోళనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడుని నెగటివ్ గా ప్రొజెక్ట్ చేసిన సినిమా కాబట్టి టిడిపి సపోర్టర్స్ థియేటర్ల దగ్గరకు వచ్చి నిరసన ప్రదర్శనలు షోలు ఆపేయించడాలు చేస్తారేమో అని భయపడుతున్నారు. అధికార పార్టీ కాబట్టి స్థానిక మద్దతు బలంగా ఉంటుంది. ఒక్క షో ఆగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకొచ్చిన గొడవలెమ్మని జనం హాళ్ల దాకా రారు.
అందుకే కోర్ట్ తీర్పు అనుకూలంగా వచ్చినా అంతా సాఫీగా ఉంటుందని అనుకోవడానికి లేదు. చాలా చోట్ల పోలీసులు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు రాజకీయ నాయకుల ప్రచార సభల్లో సెక్యూరిటీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. సో సినిమా హాళ్ల దగ్గర రక్షణగా ఉండే ఛాన్స్ తక్కువే. ఈ నేపథ్యంలో రేపు లక్ష్మీస్ ఎన్టీఆర్ తాలూకు పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రోజు కోర్ట్ ఏమి చెబుతోందో అనే దాన్ని బట్టే ఇది ఏ మలుపు తీసుకుంటుందో క్లారిటీ వస్తుంది