Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ నిజంగానే ఉన్నట్టున్నాయే!
By: Tupaki Desk | 14 Feb 2019 5:28 PM GMTపోయినేడాది 'ఆఫీసర్' చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ డై హార్డ్ ఫ్యాన్స్ అందరూ దాదాపుగా ఆయనపై ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను ప్రకటించినప్పుడు ఈ సినిమాను ఏం చేస్తాడో ఏంటో అనుకున్నారు. ఏకంగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ అసలు నిజాలు నేనే చూపిస్తానని.. మాదే అసలు బయోపిక్ అని.. మాకే 'పెద్దాయన' ఆశీస్సులు ఉన్నాయని ట్విట్టర్లో హంగామా చేస్తుంటే వర్మకు ఇది అలవాటైన వ్యవహారమే కదా అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ప్రేమికుల రోజు రొమాన్స్ సినిమాల ట్రైలర్లురిలీజ్ చేయడం సబబైన రోజున 'లక్షీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల చేసి అందరినీ తనవైపు తిప్పుకున్నాడు వర్మ. హార్డ్ హిట్టింగ్ ట్రైలర్ తో ఒక్కసారి పాత వర్మను గుర్తు తెచ్చాడు.
ట్రైలర్ రిలీజ్ చేసిన ఒకటిన్నర గంటలలోనే వన్ మిలియన్ వ్యూస్ మార్క్ దాటిందని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా "లార్డ్ ఎన్టీఆర్ బ్లెస్సింగ్" అంటూ రిలీజ్ అయిన రెండు గంటలకు ట్వీట్ చేశాడు. ఇప్పటికి ఆ వ్యూస్ సంఖ్య RGV అధికారిక ఛానల్ లోనే మూడు మిలియన్లు దాటింది. 167K లైక్స్ వచ్చాయి. డిస్లైక్స్ 12K ఉన్నాయి. ఇక కామెంట్స్ ఏకంగా 18 వేలు. వీటిలోఅతి తక్కువ మంది మాత్రమే వర్మను తిట్టారు. మెజారిటీ కామెంట్లు ఆర్జీవీ ధైర్యాన్ని పొగుడుతూ ఉన్నవే. 'ఆడు మగాడ్రా బుజ్జీ' అని ఒకరంటే మరొకరు.."నువ్వు తోపు అన్నా.. ఇలాంటి సిన్మా తీయాలంటే నీకే సాధ్యం" అన్నారు. ఒకరైతే "ఇండియా లో ఫ్రీడమ్ వచ్చింది ఒక్క ఆర్జీవీ కే" అంటూ వర్మ గట్స్ ను మెచ్చుకున్నారు.
చిత్రమైన విషయం ఏంటంటే కామెంట్స్ చేసిన అందరూ దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ పట్ల ఎంతో ప్రేమ.. గౌరవం చూపించడం. ఎక్కువ శాతం మంది అయనకు ఇలా జరిగి ఉండాల్సింది కాదని.. ఎన్టీఆర్ ఓ లెజెండ్ అయినప్పటికీ ఆయనకు అన్యాయం జరిగిందని సానుభూతి చూపిస్తున్నారు. ఇందులో మీకు అనుమానాలు ఏమైనా ఉంటే ఆర్జీవీ అధికారిక ఛానల్ లో కింద కామెంట్స్ ను తీరిగ్గా ఓపిగ్గా చదవండి. తత్వం బోధపడుతుంది. ఈ రకంగా ట్రైలర్ జనాల్లోకి పూర్తిగా చొచ్చుకుని వెళ్తున్నట్టే. ఇక సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో.