Begin typing your search above and press return to search.
క్లీన్ సర్టిఫికెట్ దక్కించుకున్న యంగ్ హీరో మూవీ
By: Tupaki Desk | 7 Dec 2021 12:30 PM GMTఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య తక్కువ గ్యాప్ లోనే మరో సినిమా తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. వరుడు కావలెను సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కరోనా భయం మరియు థియేటర్ల వద్ద ఉన్న పరిస్థితుల కారణంగా వరుడు కావలెను సినిమా కు ఆశించిన వసూళ్లు నమోదు అవ్వలేదు అనేది టాక్. ఇక నాగ శౌర్య తదుపరి సినిమా లక్ష్య విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో శౌర్య విలుకాడిగా కనిపించబోతున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాను డిసెంబర్ 10వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ యూ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఈమద్య కాలంలో క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కనీసం యూ/ఎ అయినా ఉంటున్నాయి. యాక్షన్ మరియు రొమాన్స్ ఉండే కమర్షియల్ సినిమాలు క్లీన్ యూ సర్టిఫికెట్ ను దక్కించుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. క్లీన్ యూ రావడం వల్ల లక్ష్య సినిమా లో శృతి మించిన హింస కాని.. రొమాన్స్ కాని ఉండదని తేలిపోయింది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఒక మంచి ఎంటర్ టైనర్ గా రూపొందినట్లుగా టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న లక్ష్య సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది. ఈ పెద్ద సినిమాల నుండి పోటీ లేకపోవడం కలిసి వచ్చే అవకాశం అంటున్నారు.
నాగ శౌర్యకు జోడీగా ఈ సినిమాలో రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ నటించింది. సచిన్ ఖేదేకర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమాను నారాయన్ దాస్ నారంగ్ మరియు శరత్ మరార్ లు నిర్మించారు. డిసెంబర్ 10వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా కు భారీ ఎత్తున థియేటర్లు లభించినట్లుగా తెలుస్తోంది. గత వారం విడుదల అయిన అఖండ సినిమా తప్ప ఈ సినిమాకు పెద్ద పోటీ ఏమీ లేదు. కనుక పాజిటివ్ టాక్ దక్కించుకుంటే బ్రేక్ ఈవెన్ సాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగ శౌర్య ఈ సినిమాతో అయినా బ్రేక్ ఈవెన్ సాధించి కమర్షియల్ హిట్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.