Begin typing your search above and press return to search.
లాల్ సింగ్ చడ్డా.. అమీర్ కి 100కోట్ల నష్టం?
By: Tupaki Desk | 31 Aug 2022 4:40 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నాలుగేళ్ల శ్రమ తనకు ఎంతమాత్రం కలిసి రాకపోగా తీవ్రమైన స్ట్రెస్ ని మిగిల్చింది. కఠోరమైన అతడి ప్రయత్నం గంగలో పోసిన పన్నీరు అయ్యింది. 'లాల్ సింగ్ చడ్డా' రూపంలో డిజాస్టర్ ని ఎదుర్కోవడంతో నాలుగేళ్ళ శ్రమకు అతడు అందుకోవాల్సిన 100కోట్ల పారితోషికం మొత్తాన్ని వదులుకోవాల్సి వస్తోందని బాలీవుడ్ మీడియాలు కథనాలు వెలువరిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన సోషల్ డ్రామా 'లాల్ సింగ్ చద్దా' భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన వైఫల్యాన్ని ఎదుర్కొంది. అమీర్ ఖాన్ చిత్రం రూ.60 కోట్ల లోపు కలెక్షన్లతో ఫుల్ రన్ ని ముగించింది. దీంతో ఇప్పటి వరకు భారతీయ సినిమా పరిశ్రమ అతిపెద్ద డిజాస్టర్ లలో ఒకటిగా లాల్ సింగ్ చడ్డా నిలిచింది.
అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన వయాకామ్ 18 స్టూడియోస్ కు ఆ నష్టాలను అమీర్ ఖాన్ ఏ రూపంలో భర్తీ చేస్తారు? అన్న చర్చా సాగుతోంది.
తాజా గుసగుసల ప్రకారం.. అమీర్ తన పారితోషికాన్ని పూర్తిగా వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. లాల్ సింగ్ చడ్డా నష్టాలకు అమీర్ బాధ్యత వహిస్తున్నారు. వయాకామ్ 18 స్టూడియోస్ దాదాపు రూ. 100 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాన్ని అమీర్ ఖాన్ స్వయంగా చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇప్పుడు నిర్మాత కేవలం నామమాత్రపు పెట్టుబడిని మాత్రమే కోల్పోతాడని తెలిసింది.
అమీర్ ఈ వైఫల్యానినికి తాను తప్ప మరెవరూ బాధపడకూడదని కోరుకున్నాడు. అతను ఈ చిత్రానికి నాలుగేళ్లు కేటాయించాడు. కానీ దాని నుండి ఒక్క పైసా కూడా సంపాదించలేదు. లాల్ సింగ్ చద్దాపై అతని ఖర్చు రూ. 100 కోట్లకు పైగా ఉంది. అయితే అతను పూర్తిగా వైఫల్యాన్ని తనపై వేసుకుని నష్టాలన్నింటినీ భరించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ లో ఘనమైన ఎంట్రీ ఇవ్వాలనుకున్న టాలీవుడ్ యువహీరో నాగచైతన్యకు ఇది నిజంగా ఊహించని ఫలితం.
అపజయమెరుగని పర్ఫెక్ట్ హీరోగా కొన్నేళ్ల పాటు ఏలిన అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో తొలి భారీ వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత దానిని కొనసాగిస్తూ ఇప్పుడు 'లాల్ సింగ్ చడ్డా' రూపంలో మరో అతి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీని నుంచి కోలుకునేందుకు అతడు సుదీర్ఘ విరామం తీసుకోనున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.